రూ 60 లక్షల విలువైన డైమండ్స్‌ కొట్టేశారు..

31 Jul, 2019 08:33 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

న్యూఢిల్లీ : ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద బొమ్మలు అమ్ముకునే మహిళలు కొందరు పార్ట్‌టైమ్‌గా పాకెట్స్‌ కట్‌ చేసే పనిలో పడ్డారు. జనసమ్మర్ధ ప్రాంతాల్లో చోరీలకు తెగబడుతూ రాజధాని పోలీసులకు పట్టుబడ్డారు. ఢిల్లీ మెట్రోలో చోరీలకు పాల్పడుతూ పట్టుబడ్డ ఏడుగురు మహిళల ముఠా నుంచి చోరీకి గురైన రూ 60 లక్షల విలువైన డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. నగరానికి చెందిన నిందితులు చిమ్నా, అంజలి, రీటా, ఆశా, పూనం, అనితా, రేష్మాలుగా గుర్తించిన పోలీసులు వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరు ఓ ముఠాగా ఏర్పడి మెట్రో స్టేషన్లు, బస్సులు, రైళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు.

వ్యాపార పని నిమిత్తం ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తి వీరి బారిన పడటంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 28న బాధితుడు కరోల్‌బాగ్‌ నుంచి ఇంద్రప్రస్థ మెట్రో స్టేషన్‌కు ప్రయాణిస్తుండగా, మార్గమధ్యలో డైమండ్స్‌ ఉన్న బ్యాగ్‌ అదృశ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అదే ట్రైన్‌లో బరకంబ మెట్రో స్టేషన్‌ వద్ద ఏడుగురు మహిళలు రైలు దిగినట్టు వెల్లడైంది.

అనుమానిత మహిళలు దిగిన ట్రైన్‌ కోచ్‌లోనే బాధితుడు ప్రయాణిస్తుండటం, నిందితుల్లో ఓ మహిళ బాధితుడు పోగొట్టుకున్న బ్యాగ్‌ను పోలిన బ్యాగ్‌ను తీసుకువెళుతుండటం సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. దొంగిలించిన డైమండ్స్‌ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న మహిళలను షాదిపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ 60 లక్షల విలువైన డైమండ్స్‌ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద బొమ్మలు అమ్ముకుంటూ జీవనం గడిపేవారని , రోజువారీ ఖర్చుల కోసం చోరీలకు తెగబడుతున్నారని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వివాహేతర సంబంధమే ఊపిరి తీసింది.. !

ఈ కేటుగాడు... ఒకప్పటి ‘ఆటగాడు’

అమ్మను కాపాడుకోలేమా?

9 నెలల క్రితం అదృశ్యం.. 6 నెలల గర్భిణిగా ప్రత్యక్షం

పోలీసుల వలలో మోసగాడు

రంజీ క్రికెటర్‌ నకిలీ ఆటలు

కిడ్నాప్‌ కథ సుఖాంతం

పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే పెట్రోల్‌ పోసుకుని..

గ్యాంగ్‌ లీడర్‌ ఇంకా చిక్కలేదు: సీపీ

అరిస్తే చంపేస్తానని బెదిరించాడు..

కాపురానికి రాలేదని భార్యను..

ఫేస్‌బుక్‌ ప్రేమ; రూ.11 లక్షలు గోవిందా..!

ప్రాణం తీసిన ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ ఆట

భార్యకు కరెంట్‌ షాక్‌ ఇచ్చి చంపాడు

ఘరానా మోసగాడు షేక్ సర్దార్ హుస్సేన్ అరెస్టు

బైక్‌ను తీసుకొని పారిపోతుండగా..

వ్యాపారి గజేంద్ర కిడ్నాప్‌ మిస్టరీ వీడింది

అర్చకత్వం కోసం దాయాది హత్య

భర్త వేధింపులతో ఆత్మహత్య 

సెక్యూరిటీ గార్డు నుంచి ఘరానా దొంగగా!

అన్నను చంపిన తమ్ముడు

సంగం డెయిరీ భారీ చోరీని ఛేదించిన పోలీసులు

తల్వార్‌తో రౌడీషీటర్‌ వీరంగం

నాడు అలా.. నేడు ఇలా..

రైస్‌ పుల్లింగ్‌ ముఠా అరెస్టు

నగదుతో ఉడాయించిన వ్యక్తే కిడ్నాపరా?

సంగం డెయిరీలో రూ.44.43 లక్షల చోరీ

తలలు ఓ చోట, మొండాలు మరోచోట..

కోడెల శిష్యుడు కోర్టులో లొంగుబాటు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి