వీడియో తీసి..బెదిరించి..ఆపై లైంగిక దాడి

11 Sep, 2019 14:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేత, కేంద్ర మాజీ మం‍త్రి స్వామి చిన్మయానంద్‌ తనపై ఏడాడి పాటు లైంగిక దాడి, వేధింపులకు పాల్పడ్డాడని ఆయన నిర్వహించే కళాశాలకు చెందిన లా స్టూడెంట్‌ ఆరోపించిన క్రమంలో స్వామి బాగోతాలపై బాధితురాలు మరికొన్ని వివరాలు వెల్లడించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) ఆమె స్వామిపై ఆరోపణలకు ఆధారాలను అందచేసినట్టు తెలిసింది. యూపీలోని షహజన్‌పూర్‌లో లా కోర్సులో అడ్మిషన్‌ కోసం తాను గత ఏడాది జూన్‌లో చిన్మయానంద్‌ను తాను తొలిసారి కలిశానని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్మయానంద్‌ తన ఫోన్‌ నెంబర్‌ తీసుకుని తనకు లా కాలేజ్‌లో అడ్మిషన్‌ ఇప్పించారని, కాలేజ్‌ లైబ్రరీలో నెలకు రూ 5000 వేతనానికి ఉద్యోగం కల్పించారని చెప్పుకొచ్చారు.

అక్టోబర్‌లో తనను హాస్టల్‌కు మారాలని స్వామి చిన్మయానంద్‌ కోరారని, ఆ తర్వాత ఆశ్రమానికి పిలిపించారని చెప్పారు. ఆశ్రమంలో స్వామిని కలవగా తాను హాస్టల్‌లో స్నానం చేస్తున్న వీడియోను చూపి తాను చెప్పినట్టు వినకుంటే దాన్ని వైరల్‌ చేస్తానని బెదిరించి లోబరుచుకున్నాడని ఆరోపించారు. లైంగిక దాడి దృశ్యాలనూ రికార్డు చేసిన చిన్మయానంద్‌ వాటిని చూపి బ్లాక్‌మెయిల్‌ చేసేవాడని చెప్పారు. స్వామి శిష్యులు తనకు తుపాకీ గురిచూపి ఆయన వద్దకు తీసుకువెళ్లేవారని, ఆయనకు తనతో మసాజ్‌ చేయించేవారని అన్నారు. ఈ ఏడాది జులై వరకూ ఈ వికృత చర్యలు కొనసాగాయని, చిన్మయానంద్‌ దుశ్చర్యలపై వీడియోలను రూపొందించాలని నిర్ణయించుకుని ఈ ఏడాది ఆగస్ట్‌లో ఫేస్‌బుక్‌లో వీడియోను పోస్ట్‌ చేసి కాలేజీ నుంచి పారిపోయినట్టు వెల్లడించారు. మరోవైపు చిన్మయానంద్‌ తన కుమార్తెతో పాటు పలువురు యువతులను లైంగికంగా వేధించాడని బాధితురాలి తండ్రి యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్మయానంద్‌పై యూపీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరోవైపు యువతి ఆరోపణలను స్వామి చిన్మయానంద్‌ న్యాయవాది తోసిపుచ్చారు. స్వామి ప్రతిష్టను దిగజార్చేందుకు జరిగిన రాజకీయ కుట్రలో భాగంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జీతం కోసం వస్తే.. బ్రోతల్‌ హౌస్‌కు

‘అతడిపై హత్య కేసు కూడా ఉంది’

ఘరానా దొంగ మంత్రి శంకర్‌ మళ్లీ దొరికాడు

నగరంలో నేపాలీ గ్యాంగ్‌

ఆర్టీసీ బస్సులు ఢీ: డ్రైవర్‌ మృతి 

ఆర్మీ ఉద్యోగి సతీష్‌ది హత్యే

ఆటోలో తీసుకెళ్లి.. వివాహితపై అత్యాచారం

ప్రజలకు చేరువగా పోలీస్‌ ఠాణాలు

విశాఖలో ప్రాణం తీసిన పబ్‌జీ

గంజాయి సిగరెట్‌ @ రూ.100

వలంటీర్‌పై టీడీపీ వర్గీయుల దాడి

పాఠశాలలో టీచర్‌ రాసలీలలు.. దేహశుద్ధి 

పండగకు వచ్చి.. ప్రాణాలు కోల్పోయారు

కొండగట్టు బస్సు ప్రమాదానికి ఏడాది

పసికందు మృతి.. గుట్టు చప్పుడు కాకుండా

మత్తుమందు ఇచ్చి నగలు దోపిడీ

బాలికపై అత్యాచారయత్నం

నెత్తురోడిన జాతీయ రహదారి: 24 మందికి తీవ్ర గాయాలు

ఇద్దరు దొంగలు అరెస్ట్‌: 159 గ్రాముల బంగారం స్వాధీనం

పెళ్లికి నిరాకరించిందని దాడి!

స్విగ్గీ పేరుతో మహిళకు కుచ్చుటోపీ

బ్యాంకులో బంగారం విడిపిస్తానని ఫైనాన్సియర్‌ను నమ్మించి..

కాపురానికి తీసుకెళ్లాలని ఆందోళన

చంపి బావిలో పడేశారని భర్తపై దాడి..

మూడో పెళ్లికి సిద్ధం.. ఇద్దరు పెళ్లాల యుద్ధం

పెళ్లి కాకుండానే గర్భం.. విచ్ఛిత్తికి యత్నం

ఆడపిల్ల అని చంపేశారు 

దారుణం : భర్త కళ్ల ముందే భార్యపై అత్యాచారం

దొంగతనానికి వెళ్లి యువతి పక్కన నగ్నంగా...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా’లో విభేదాలు లేవు

బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా

‘మార్షల్‌’  పెద్ద హిట్‌ అవుతుంది : శ్రీకాంత్‌

అది నిజమే కానీ, అతను యాక్టర్‌ కాదు

ప్రియాంకకు వార్నింగ్‌ ఇచ్చిన పోలీసులు

'నిశ్శబ్దం'లో అనుష్క అదిరిపోయిందిగా..