కొరియర్‌ బాయ్‌లే టార్గెట్‌..!

12 Nov, 2019 07:24 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డి

జల్సాలకు అలవాటు పడి విద్యార్థి చోరీల బాట

నిందితుడి అరెస్ట్‌ చోరీ సొత్తు స్వాధీనం

దుండిగల్‌: జల్సాలకు అలవాటు పడి కొరియర్‌ బాయ్‌లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఓ విద్యార్థిని దుండిగల్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ నర్సింహారావు, ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ కలిసి వివరాలు వెల్లడించారు. ప్రగతినగర్, మధురానగర్‌ కాలనీకి చెందిన శ్రీనివాసులు కుమారుడు తుంగల శ్రీరామ్‌ బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతను దొంగతనాలకు అలవాటు పడ్డాడు. గతంలో కేపీహెచ్‌బీ కాలనీలోని  ఓ హాస్టల్‌ వద్ద బైక్‌ను చోరీ చేసిన ఘటనలో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా అతని వైఖరిలో మార్పు రాలేదు.  

దొరికింది ఇలా..
తరచూ కొరియర్‌ బాయ్స్‌ బ్యాగ్‌లు చోరీలకు గురవుతుండటంతో అమేజాన్‌ సంస్థ ప్రతినిధులు దుండిగల్‌ పోలీసులకు ఫిరా>్యదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్, ఎస్సై భూపాల్‌ షాపూర్‌నగర్, బాలానగర్, కూకట్‌పల్లి వై–జంక్షన్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా చోరీ చేసిన వాహనంపై తిరుగుతున్న శ్రీరామ్‌ను గుర్తించారు. దీంతో అతడిపై నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు సోమవారం దుండిగల్‌లో  అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. అతడి నుంచి రూ.4 లక్షలు విలువైన రెండు బైక్‌లు, 15 సెల్‌ఫోన్లు, నాలుగు డెలివరీ బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై భూపాల్‌గౌడ్‌ తో పాటు కానిస్టేబుళ్లు చంద్రయ్య, కేశవులు, సమ్మయ్య, భీంబాబు, ఎస్‌.కె.రహీం, ఆర్‌.శ్రీనివాస్‌రావు, రాంచందర్‌లను డీసీపీ  నగదు పురస్కారంతో సత్కరించారు.  

కాపు కాసి కొట్టేస్తాడు..
శ్రీరామ్‌ షాపూర్‌నగర్, బాలానగర్, కూకట్‌పల్లి వై– జంక్షన్‌ ప్రాంతాల్లో మకాం వేసే శ్రీరామ్‌ ఆయా ప్రాంతాల గుండా వెళ్లే కొరియర్‌ బాయ్స్‌ను టార్గెట్‌గా చేసుకుంటాడు. వారిని వెంబడించే అతను కొరియర్‌ బాయ్స్‌ తమ బ్యాగ్‌లను బైక్‌పై ఉంచి పార్శిల్‌ డెలివరీ చేసే వచ్చేలోగా బ్యాగ్‌లతో ఉడాయిస్తాడు. ఈ చోరీలకు గాను తాను దొంగిలించిన వాహనంతో పాటు తన తండ్రి బైక్‌ను వినియోగించేవాడు. ఇదే తరహాలో దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ కాలనీ, జీడిమెట్ల, కూకట్‌పల్లి, సనత్‌నగర్, బేగంపేట పీఎస్‌ల పరిధిలో ఒక్కో దొంగతనానికి పాల్పడ్డాడు. అతను ఎక్కువగా అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌ డీల్‌ కంపెనీలకు చెందిన డెలివరీ బాయ్స్‌ను మాత్రమే టార్గెట్‌గా చేసుకునేవాడు. చోరీ చేసిన వస్తువులను విక్రయించి జల్సా చేసేశాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేరగాడు.. బిచ్చగాడు!

ఆడపిల్లలు పుట్టారని అమానుషం

వరుడి సూసైడ్‌ : వారిపైనే అనుమానం

వర్షిత హంతకుడి సీసీ ఫుటేజీ చిత్రాలు విడుదల

పక్కింటోడే చిన్నారి ప్రాణాలు తీశాడు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థుల మృతి

కారు బోల్తా, ఇంజనీరింగ్‌ విద్యార్థులు మృతి

బెజవాడ: అల్లరి మూకల చిల్లర చేష్టలు!

విద్యార్థిని జీవితం సెల్ఫీకి బలైపోయింది!

భీమవరంలో ఎం.ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

గోనె సంచిలో చిన్నారి ద్వారక మృతదేహం

మహిళను ముంచిన ‘మందు’

చార్జింగ్‌లో ఉన్న మొబైల్‌ పేలి యువకుడి మృతి

సీసీటీవీ అనుకుని దాన్ని ఎత్తుకెళ్లిపోయారు..

టిక్‌టాక్‌ వీడియో వైరల్‌తో మనస్తాపం..

రోడ్డుపై నుంచి.. వంతెనలో..

సైడ్‌ ఇవ్వలేదని..

మోడల్‌తో ప్రేమాయణం..తరచు విదేశీయానం

హోటల్‌లో యువతిపై అఘాయిత్యం

రెప్పపాటులో ఘోరం

ఓఎల్‌ఎక్స్‌ పేరుతో ఆగని మోసాలు

పెళ్లికొడుకు మృతి కేసులో ట్విస్ట్‌

ఆడుకుంటూనే.. పోయింది!

ప్రాణం తీసిన సెల్ఫీ మోజు

ఠాణాలో తాగి..సెల్ఫీ దిగిన నేతలు

అల్వాల్‌లో అమానుషం

మృతదేహాన్ని ఒకరోజు దాచి.. చెరువులో వేశారు

మంత్రగత్తె ముద్ర వేసి చెప్పుల దండతో ఊరేగింపు..

‘రెప్పపాటు’ ఘోరం.. నిద్రమత్తులో రైలు దిగుతూ..

తిన్నది కక్కిస్తారా.. గతంలోలాగా వదిలేస్తారా? 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆశ పెట్టుకోవడం లేదు

మామ వర్సెస్‌ అల్లుడు

బుజ్జి బుజ్జి మాటలు

గోవాలో...

తెల్ల కాగితంలా వెళ్లాలి

విజయ్‌ సేతుపతితో స్టార్‌డమ్‌ వస్తుంది