హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక..

24 Jul, 2019 13:07 IST|Sakshi
మౌనిక (ఫైల్‌)

విద్యార్థిని ఆత్మహత్య

మీర్‌పేట: హాస్టల్‌లో ఉంటూ చదువుకోవడం ఇష్టంలేక ఓ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, మాడ్గుల మండలం, నర్సంపల్లి గ్రామానికి చెందిన వల్లదాసు పెద్దయ్య బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి జిల్లెలగూడ బాలాజీనగర్‌లో ఉంటున్నాడు. అతడి పెద్ద కుమార్తె మౌనిక (17)ను ఇంటర్మీడియట్‌ చదివేందుకు సిద్దిపేట జిల్లా, సముద్రాల గ్రామంలోని ప్రభుత్వ మోడల్‌ హాస్టల్‌లో చేర్పించాడు. హాస్టల్‌లో ఉండి చదువుకోవడం ఇష్టం లేదని ఆమె పలుమార్లు తల్లిదండ్రులకు చెప్పింది. ఈ నెల 22న హాస్టల్‌ నుంచి  ఇంటికి వచ్చింది. మంగళవారం ఉదయం తల్లి అలివేలు  బయటికు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేకే మౌనిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్థిక ఇబ్బందులతో బ్యూటీషియన్‌..

బంగారం అలా వేసుకు తిరిగితే ఎలా?..

పొలం పనికి వెళ్లి.. విగతజీవిగా మారాడు 

అక్క ఆస్తి కబ్జాకు తమ్ముళ్ల కుట్ర

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు నోటీసులు 

అప్పు తీసుకున్న వ్యక్తి మోసం చేశాడని..

ఒకే బైక్‌పై ఐదుగురు.. ముగ్గురి మృతి

ప్రియుడే హంతకుడు.. !

అవినీతి జబ్బు!

బొల్లినేని గాంధీపై ఈడీ కేసు

కట్టుకున్నవాడే కడతేర్చాడు

కోల్‌కతాలో సైనికుడి మృతి

మొదట ఇంటి దొంగల వేట.. ఎస్పీ అభిషేక్‌ మహంతి

కన్నా.. ఎక్కడున్నావ్‌?

కార్‌ డోర్లు లాక్‌.. ఇద్దరు పిల్లల మృత్యువాత

మాజీ మహిళా మేయర్‌ దారుణ హత్య..!

నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టు

భర్త హత్యకు సుపారీ.. సొమ్ము కోసం ఇల్లు అమ్మకం

మిర్యాలగూడలో విషాదం..!

చనిపోయి.. తిరిగొచ్చిందా?

కు.ని చికిత్స చేసుకున్న మహిళ మృతి

పోలీసులే మహిళతో..

బొల్లినేని గాంధీపై ఈడీ కేసు

ఘోర రోడ్డు ప్రమాదం

తృణమూల్‌ కార్యకర్త దారుణ హత్య..!

అమ్మతనం ఆవిరైంది.. నాలుగో అంతస్తు పైనుంచి..

కుటుంబంతో సహా బీజేపీ నాయకుడి దారుణ హత్య

కేపీహెచ్‌బీలో బ్యూటీషియన్‌ ఆత్మహత్య

సినిమాను తలదన్నే.. లవ్‌ క్రైం స్టోరీ..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

బన్నీ సినిమాలో టబు లుక్‌!

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?