నారాయణలో విద్యార్థి అనుమానాస్పద మృతి

2 Jul, 2019 14:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గూడవల్లిలోని నారాయణ కాలేజ్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. కాలేజ్‌ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించింది. విద్యార్థి మృతిపై వివరాలు వెల్లడించేందుకు కాలేజ్‌ సిబ్బంది నిరాకరిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థి మృతిపై పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

iframe border="0" width="100%" height="380" src="https://www.sakshi.com/sites/default/files/video/embed/2019/07/02/1203235.html" frameborder="0" scrolling="no" >

మరిన్ని వార్తలు