నగరంలో యువతి అదృశ్యం

5 Feb, 2020 09:26 IST|Sakshi
ఇంద్రజ (ఫైల్‌)

ధర్మపురిలో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు  

సుల్తాన్‌బజార్‌ పీఎస్‌కు కేసు బదిలీ   

సుల్తాన్‌బజార్‌: నగరంలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని అదృశ్యం కేసులో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సుల్తాన్‌బజార్‌ ఎస్‌ఐ వై.లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎన్‌.బుచ్చన్న కుమార్తె ఎన్‌.ఇంద్రజ (19) నగరంలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. కోఠిలోని గోకుల్‌చాట్‌ పక్కన ఉన్న ఆర్‌పీఎస్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటోంది. ఈ నెల 1న ధర్మపురిలోని ఇంటికి వెళ్తున్నానంటూ కోఠిలోని హాస్టల్‌ నుంచి బయలుదేరింది. మూడు రోజులవుతున్నా ఆమె ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు కోఠిలోని హాస్టల్‌లో వాకబు చేశారు. ఈ నెల 1వ తేదీనే ఇంద్రజ బయల్దేరిందని హాస్టల్‌ నిర్వాహకులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కడి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌గా కేసును నమోదు చేసుకుని ఆన్‌లైన్‌లో సుల్తాన్‌బజార్‌ పోలీసులకు బదిలీ చేశారు. యువతి అదృశ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు