న్యాయవాది హత్య కిరాయి హంతకుల పనే..

1 Jun, 2018 09:09 IST|Sakshi
మృతురాలి కుటుంబీకులను విచారిస్తున్న డీఎస్పీ, సీఐలు

ప్రాథమిక నిర్ధారణలో పోలీసులు

రంగంలోకి నాలుగు బృందాలు

నిందితులను పట్టుకు    తీరుతామన్న డీఎస్పీ, సీఐ

మదనపల్లె క్రైం : మదనపల్లె పట్టణం ఎస్‌బీఐ కాలనీ సమీపంలో బుధవారం జరిగిన మహిళా న్యాయవాది నాగజ్యోతి హత్య కిరాయి హంతకుల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. భార్య భర్తల మధ్య విభేదాలు ఉన్నాయన్న అనుమానంతో..ఈ హత్యను కిరాయి హంతకులతో చేయించి ఉంటారన్న కోణంలో విచారిస్తున్నారు. పక్కా ఆధారాలను రాబట్టేందుకు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. నిందితులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని డిఎస్పీ ఎం. చిదానందరెడ్డి, సీఐ సురేష్‌ కుమార్‌ గురువారం విలేకర్లకు తెలిపారు.

ఆ ఆధారాలే కీలకం
నాగజ్యోతి హత్య కిరాయి హంతకుల పనేనని  డీఎస్పీ ఎం. చిదానందరెడ్డి తెలిపారు. భార్యా, భర్తల మధ్య విభేదాలు ఉండడం, ఆర్థిక, ఆస్తి తదితర వివాదాల కారణంగా ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశారు. పోలీసులు ఆదిశగా విచారణ చేస్తున్నామన్నారు. కుటుంబీకులను కూడా  విచారించామన్నారు. అయితే పోలీసులకు సంఘటనాస్థలంలో లభించిన ఆధారాలు కీలకం కానున్నాయి. న్యాయవాది ఎస్‌బీఐ కాలనీలో షాపింగ్‌ చేసుకుని బయటకు వచ్చిన ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.హత్య తరువాత నిందితులు  కత్తితో నడచుకుంటూ వెళ్లడం స్థానికులు చూశారు.  కొందరి ముఠా సభ్యుల పేర్లు చెప్పినట్లు తెలుస్తుంది. వీరిలో గతంలో భూ దందాలు, సెటిల్‌ మెంట్లు, దాడులు, హత్యాయత్నాలకు పాల్పడినవారు, కొందరి నాయకుల అనుచరులుగా  ఉన్నట్లు తెలియడంతో పోలీసులు ఆదిశగా దర్యాప్తు సాగిస్తున్నారు.

గతంలోనే హత్యాయత్నం
 నాగజ్యోతిపై గతంలో కొందరు నాలుగు పర్యాయాలు  ఆమె ఇంటిలోనే హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలసింది. మరోవెపు  నిందితుల తరఫున కేసును వాదించబోమని స్థానిక బార్‌ అసోసియేషన్‌ నాయకులు గురువారం తీర్మానించారు.

మరిన్ని వార్తలు