రెండో భర్తపై నటి ఫిర్యాదు

24 Jan, 2020 10:12 IST|Sakshi

చెన్నై,పెరంబూరు: సినీ నటి తన రెండో భర్త లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. చెన్నై, తూర్పు ముగప్పేర్‌కు చెందిన  ఆమె (39) తన భర్తకు విడాకులిచ్చి విడిగా జీవిస్తోంది. ఆమెకు  ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కాగా షెనాయ్‌ నగర్‌లో ఆ నటి సొంతంగా యోగా శిక్షణశాలను నిర్వహిస్తోంది. సినీ, టీవీ సీరియళ్లలోనూ చిన్నచిన్న పాత్రల్లో నటిస్తోంది. నటుడు శివకార్తికేయన్‌ హీరోగా నటించిన మాన్‌ కరాటే చిత్రంలో ఆమె నటించింది. అలా సాంకేతిక నిపుణుడు శరవణన్‌ సుబ్రమణి(42)తో  పరిచయం కలిగింది. దీంతో అతనితో రెండో పెళ్లికి దారి తీసింది.

కాగా సహాయ నటి బుధవారం స్థానిక తిరుమంగళం మహిళా పోలీస్‌స్టేషన్‌లో శరవణన్‌ సుబ్రమణిపై ఫిర్యాదు చేసింది. రెండో భర్త శరవణన్‌ సుబ్రమణి తన నగలను, నగదును దోచుకున్నాడని పేర్కొంది. అంతే కాకుండా లైంగిక వేధిపులకు గురి చేస్తున్నాడని తెలిపింది. అతని స్నేహితులను ఇంటికి తీసుకొచ్చి వారి ముందు డాన్స్‌ చేయమని ఒత్తిడి చేస్తున్నాడని చెప్పింది. తన పిల్లలను చితక బాదుతున్నట్లు తెలిపింది. శరవణన్‌ సుబ్రమణికి ఇంతకు ముందే ఆర్తి అనే మహిళతో పెళ్లి అయ్యిందని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొంది.

అంతేకాకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు, ఆమెకు ఒక బిడ్డ ఉన్నట్టు తెలిసిందని చెప్పింది. కాగా సుబ్రమణి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి తనను మరో పెళ్లి చేసుకుని మోసం చేశాడని చెప్పింది. అంతే కాకుండా ఇప్పుడు తన మొదటి భార్యతో కలిసి కిరాయి మనుషులతో హతమార్చుతానంటూ బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. భర్త, అతడి మొదటి భార్యతో పాటు దిండిగల్‌ శరవణన్‌, కిరాయి మనుషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర‍్యాదులో కోరింది. కేసును సీఐ విజయలక్ష్మి విచారణ జరుపుతున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా