కథువా కేసు : విచారణపై సుప్రీం స్టే

27 Apr, 2018 16:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా మైనర్‌ బాలిక హత్యాచారం కేసు విచారణపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కేసు విచారణను చండీఘర్‌కు బదలాయించాలన్న అప్పీల్‌పై స్పందించాలని నిందితుడిని కోరింది. కథువాలో శనివారం జరగాల్సిన విచారణను నిలిపివేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస​ ఇందూ మల్హోత్రాలతో కూడిన సుప్రీం బెంచ్‌ పేర్కొంది. కేసు బదలాయింపు పిటిషన్‌పై మే 7న తాము విచారణ చేపడతామని ప్రకటించింది.

గతంలో కేసు విచారణను చండీఘర్‌కు బదలాయించాలన్న ప్రతిపాదనను జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం వ్యతిరేకించింది. జమ్మూ కశ్మీర్‌లో విభిన్న పీనల్‌ కోడ్‌ ఉందని, విచారణను బదలాయిస్తే సాక్షులకు అసౌకర్యం కలుగుతుందని పేర్కొంది. అయితే కేసు విచారణలో ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. కథువాలో మైనర్‌ బాలికపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడి హతమార్చడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు