అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

29 Aug, 2018 12:15 IST|Sakshi
సోఫియా మృతదేహం 

చింతకాని ఖమ్మం : మండలంలోని గాంధీనగర్‌కాలనీలో అనుమానాస్పద స్థితిలో మహ్మద్‌ సోఫియా(13) బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు... కాలనీకి చెందిన హస్నుజమా, నస్రీన్‌ దంపతుల చిన్న కుమార్తె సోఫియా, ఖమ్మం నగరంలోని పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ప్రతి రోజు ఇంటి నుంచి పాఠశాలకు బస్సులో ఖమ్మం వెళ్లి వస్తోంది. అనారోగ్యం కారణంగా సోమవారం పాఠశాలకు వెళ్లలేదు. తమ ఇంట్లోని బాత్‌రూంలో రేకుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప రాడ్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన తల్లి ఇంటికి వచ్చేసరికి కుమార్తె కన్పించకపోవటంతో బాత్‌రూం వద్దకు వెళ్లి చూసింది. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో కిందకు దించి, స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. అప్పటికే మృతిచెందినట్టుగా ఆ ఆర్‌ఎంపీ తెలిపారు. 

బాత్‌రూంలో రేకుల కోసం అమర్చిన ఇనుప రాడ్‌ ఎత్తు ఆరు అడుగులు ఉంది. రాడ్‌కు కట్టిన చున్నీ నాలుగున్నర అడుగుల కిందకు వేలాడి ఉంది. దీంతో, బాలిక మృతిపై (ఆత్మహత్యపై) స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్తకు దూరంగా నస్రీన్‌ ఉంటోంది. ఆ దంపతులకు ఐదుగురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. గతంలో రెండవ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నస్రీన్‌ ఫిర్యా దుతో ఎస్సై మొగిలి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

కాచిగూడ –యశ్వంత్‌పుర్‌ రైల్లో దోపిడీ

కూతుర్ని ప్రేమించాడని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఐదువేల మంది అనుచరులతో...

డిస్కో రాజా... ఫన్‌ రాణి!

ఆ పదాలు ఇక వినపడవు

ఆ ఇద్దరికీ నేను ఫిదా

అదే కొత్త సినిమా... అదే చివరి సినిమా?

గ్రామీణ నేపథ్యంలో...