త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

4 Jan, 2019 12:09 IST|Sakshi
ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు

బస్సును ఢీకొట్టిన ఖాళీ సిలిండర్ల లారీ

లారీ డ్రైవర్‌ పరిస్థితి విషమం

మరో నలుగురికి గాయాలు

గుంటూరు, పామర్రు: మంచులో ప్రయాణం ప్రాణాల మీదకొస్తోంది. ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదు. పామర్రు సమీపంలో గురువారం తెల్లవారుజామున  ప్రమాదం చోటుచేసుకుంది. గాయాలతో బయటపడ్డారు. పోలీసులు అందించిన వివరాలు.. ఖాళీ గ్యాస్‌ సిలిండర్లతో లారీ చల్లపల్లి నుంచి పామర్రుకు వస్తోంది. స్థానిక కోటి జగపతి ఎస్టేట్స్‌ వద్దకు రాగానే విపరీతమైన మంచుతో దారి కనిపించక అదుపు తప్పింది. విజయవాడ నుంచి అవనిగడ్డ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుని ఎదురుగా బలంగా ఢీకొట్టింది.

ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సుకు కుడివైపు కూర్చున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ బెల్లంకొండ చలపతి తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ నాగేశ్వరరావు, కండక్టర్‌ నారాయణలతో పాటు ప్రయాణికులు రమేష్, రాజేశ్వరి గాయపడ్డారు. క్షత గాత్రులను 108లో గుడివాడ ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనలో లారీలో ఖాళీ గ్యాస్‌ సిలిండర్‌లు ఉండటం కారణంగానే భారీ పెను ప్రమాదం తప్పిందని స్థానికులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ పీ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు