మొన్న బెల్లి డ్యాన్స్‌.. నిన్న తల్వార్‌ డ్యాన్స్‌

30 Jul, 2018 13:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని చాంద్రాయణగుట్ట రౌడీ రాజ్యంగా మారుతోంది. ఈ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు పెళ్లి వేడుకల్లో తమ స్థాయిని ప్రదర్శించుకోవడానికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలో బెల్లి డ్యాన్స్‌ పేరిట అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇది మరవక ముందే  మరో వివాహా వేడుకలో కొందరు తల్వార్‌ డాన్స్‌ పేరిట సామాన్య జనాలను బెదిరిపోయేలా చేశారు.

చాంద్రాయణగుట్టలోని బండ్లగూడలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం జరిగిన పెళ్లి వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫంక్షన్‌ హాల్‌ వెలుపల మెయిన్‌ రోడ్‌పై మూడు గంటలపాటు తల్వార్‌ డ్యాన్స్‌లు చేశారు. ఇది చూసిన సామాన్య ప్రజలు హడలిపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. ఇది జరిగి 48 గంటలు గడిచిన ఇప్పటివరకు దీనికి కారణమైన వారిపై పోలీసు శాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తమ ప్రాంతంలో ఇలాంటి కార్యకలపాలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి : చాంద్రాయణగుట్టలో బెల్లి డ్యాన్స్‌

మరిన్ని వార్తలు