నకిలీ మద్యం సీసాల ధ్వంసం

7 May, 2020 12:29 IST|Sakshi
మద్యం సీసాలను ధ్వంసం చేస్తున్న రోలర్‌

తిరువొత్తియూరు(తమిళనాడు): కోర్టుకు స్వాధీనం చేసిన మద్యం సీసాలను పోలీసులు రోడ్‌రోలర్‌ సాయంతో బుధవారం ధ్వంసం చేశారు. ఈ ఘటన దిండుక్కల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. గుజిలయంపారైకు చెందిన విజిలెన్స్‌ పోలీసులు నకిలీ మద్యం తయారీ కేంద్రంపై రెండు నెలల క్రితం దాడి చేసి 1,392 మద్యం బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని వేడసందు మేజిస్ట్రేట్‌ కోర్టుకు అప్పగించారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 25వ తేదీన కోర్టులో మద్యం భద్రపరిచిన గది తాళం పగలగొట్టిన కొందరు వ్యక్తులు బాటిల్స్‌ను అపహరించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పిచ్చముత్తు(45), సతీష్‌(22), సంతోష్‌(20), పాల్‌పాండి(22) అనే నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను వెంటనే ధ్వంసం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ  మేరకు దిండుక్కల్‌ మేజిసేŠట్రట్‌ మురుగన్, ఇన్‌స్పెక్టర్‌ కవిత సమక్షంలో మద్యం బాటిల్స్‌ను రోలర్‌ ద్వారా ధ్వంసం చేశారు.(ఇంతలా.. గెంతాలా..?)

మరిన్ని వార్తలు