హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ కలకలం

18 Jan, 2018 18:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ నగరంలో క్రికెట్ బెట్టింగ్ కలకలం రేపింది. భాగ్యనగరాన్ని తమ అడ్డాగా చేసుకుని క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గత కొంతకాలం నుంచి కొంతమంది వ్యక్తులు క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ లు వేస్తున్నారు. దీనిపై నిఘా ఉంచిన టాస్క్‌ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. నారాయణగూడ, అబిడ్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో బెట్టింగ్ ముఠా సభ్యులు 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

బెట్టింగ్ రాయుళ్ల వద్ద నుంచి రూ. 45 లక్షల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. క్యాష్ కౌంటింగ్ మిషన్, టీవీలు, ల్యాప్ టాప్, సెల్ ఫోన్లు, వాయిస్ రికార్డర్స్, బెట్టింగ్ వస్తువులు స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అరెస్టయిన వారిలో మనోజ్ కుమార్ అగర్వాల్, మహెందర్ కుమార్ కర్వా, రియాజుద్దీన్, యాళ్ల సరేష్ సహా మరికొంత మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు