‘నల్లగా ఉన్నావు...వంట రాదన్నందుకు’

23 Jun, 2018 10:30 IST|Sakshi
పోలీసుల అదుపులో జ్యోతి సురేష్‌ సర్వసే

ముంబై : ‘నల్లగా ఉన్నావు...వంట చేయడం రాద’ని విమర్శించినందుకు ఆహారంలో విషం కలిపి 5గురి మృతికి కారణమైంది ఓ వివాహిత. వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ప్రంద్యా అలియాస్‌ జ్యోతి సురేష్‌ సర్వసేకు రెండేళ్ల​ క్రితం వివాహమయ్యింది. కానీ వివాహమయిన నాటినుంచి ఆమె అత్తింటి వారు, బంధువులు ఆమెను నల్లగా ఉన్నావని,  వంట చేయడం రాదని విమర్శిస్తుండేవారు. వీటన్నిటిని మనసులో పెట్టుకున్న జ్యోతి తన అత్తింటివారి మీద ద్వేషం పెంచుకుంది. వారికి బుద్ధి చెప్పడం కోసం ఎదురుచూస్తుంది.

కాగా ఈ నెల 18న మహడ్‌ గ్రామానికి చెందిన సుభాష్‌ మణే అనే ఓ బంధువు తన గ్రామంలో ఒక వేడుక నిర్వహించాడు. జ్యోతి తన అత్తింటి వారితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యింది. అత్తగారి కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఈ వేడుకే మంచి అవకాశంగా భావించింది జ్యోతి. అతిథుల కోసం సిద్ధం చేసిన భోజనంలో విషం కలిపింది. ఈ విషాహారం తినడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో 7 - 13 ఏళ్ల వయసు పిల్లలు నలుగురితో పాటు ఓ 53 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నా‍రు.

విషయం తెలిసుకున్న ఖాలాపూర్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. ఆహార పదర్ధాలను పరీక్షించడం కోసం ఫోరెన్సీక్‌ లాబ్‌కు పంపించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు