అమెరికన్‌కు క్యాబ్‌డ్రైవర్‌ టోకరా

22 Oct, 2019 10:18 IST|Sakshi

న్యూఢిల్లీ : వరుస పండుగలతో ఢిల్లీలో వాణిజ్య సంస్థలను మూసివేశారని ట్యాక్సీ డ్రైవర్‌ ఓ అమెరికన్‌ను రూ 90,000కు టోకరా వేసిన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికా జాతీకయుడు జార్జ్‌ వన్మిటర్‌ ఈనెల 18న ఢిల్లీకి చేరుకుని తాను బుక్‌ చేసుకున్న హోటల్‌కు వెళ్లేందుకు ట్యాక్సీ డ్రైవర్‌ను సంప్రదించగా పండగల నేపథ్యంలో సిటీలో షట్‌డౌన్‌ కొనసాగుతోందని నమ్మించే ప్రయత్నం చేశాడు. టూరిస్ట్‌ను నకిలీ ట్రావెల్‌ ఏజెన్సీ వద్దకు తీసుకువెళ్లి తన టూర్‌ను తిరిగి ప్లాన్‌ చేసుకునేలా చేశాడు. తాను పహర్‌గంజ్‌లోని ఓ హాటల్‌లో రూమ్‌ను బుక్‌ చేసుకోగా అక్కడికి తీసుకువెళతానని చెప్పిన ట్యాక్సీ డ్రైవర్‌ కన్నాట్‌ప్లేస్‌లోని నకిలీ ట్రావెల్‌ ఏజెన్సీకి తీసుకువెళ్లాడని, అక్కడి సిబ్బంది కూడా తనకు నగరంలో షట్‌డౌన్‌ ఉందని , పహర్‌గంజ్‌లో తాను బుక్‌ చేసిన హోటల్‌ను కూడా మూసివేశారని చెప్పారని బాధితుడు తెలిపారు. అక్కడి నుంచి తనను నిందితుడు మరో నకిలీ టూర్‌ ఏజెన్సీ వద్దకు తీసుకువెళ్లగా, వారు తనకు జైపూర్, ఆగ్రాలోని హోటల్స్‌లో రూమ్‌ బుక్‌ చేశారని బాధితుడు  తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారికి డబ్బు చెల్లించి తాను ఆగ్రా వెళ్లానని చెప్పారు. ఆగ్రా వెళ్లిన తర్వాత వారు చేసిన మోసం​ గుర్తించి ఢిల్లీలోని హోటల్‌కు తాను చెల్లించిన డబ్బును వెనక్కిఇవ్వాలని కోరానని తెలిపారు. అమెరికన్‌ జాతీయుడ్ని మోసం చేసిన ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు