టీడీపీ, బీజేపీ నాయకుల ఘర్షణ

15 Dec, 2017 12:35 IST|Sakshi

టీడీపీ నాయకుడికి కత్తిపోట్లు

పాణ్యం: కమీషన్ విషయంలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీ నాయకుడికి కత్తిపోట్లు అయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగింది. పాణ్యం తండా కాలనీలో రూ.10 లక్షల ఐటీడీఏ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో కమీషన్ ఇవ్వాలని స్థానిక టీడీపీ ఉపాధ్యక్షుడు పుల్లారెడ్డి పట్టుబట్టడంతో ఇరువురి మధ్య వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

కమీషన్ ఇచ్చేందుకు ససేమిరా అన్న బీజేపీకి చెందిన కాంట్రాక్టర్, మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు పుల్లారెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న పుల్లారెడ్డి తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ పాణ్యం బస్టాండులో సుబ్బారాయుడుతో గొడవకు దిగాడు. దీంతో ఆత్మరక్షణ కోసం సుబ్బారాయుడు పుల్లారెడ్డిని కత్తితో పొడిచి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ పుల్లారెడ్డి రెడ్డిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని స్థానికులు అంటున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు