‘మీ వీడియోలేమైనా పెట్టాడా?’

31 Jan, 2018 11:46 IST|Sakshi
మున్సిపల్‌ కార్యాలయంలో వాగ్వివాదం అనంతరం బయటకు వస్తున్న మహిళా కౌన్సిలర్లు

మహిళా కౌన్సిలర్లతో 12వవార్డు కౌన్సిలర్‌ అసభ్య ప్రవర్తన

అధికార పార్టీలో ముదిరిన అశ్లీల వీడియో పోస్టింగ్‌ వివాదం

వైస్‌ చైర్మన్‌ పోస్టింగ్‌పై చైర్మన్‌ వద్ద కౌన్సిలర్ల ఆగ్రహం

చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

‘మీ వీడియోలేమైనా పెట్టాడా?’ అంటూ టీడీపీ కౌన్సిలర్‌ ఒకరు మహిళా కౌన్సిలర్లపై చేసిన వ్యాఖ్యలు పెద్దాపురంలో మున్సిపాలిటీలో దుమారం రేపాయి. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకునే స్థాయికి చేరాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు దక్కిన గౌరవం ఇదేనా? మహిళలను కించపరిచేలా ప్రవర్తించిన కౌన్సిలర్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, ఐద్వా నాయకులు డిమాండ్‌ చేశారు.

తూర్పుగోదావరి: ఇటీవల పెద్దాపురం పట్టణంలో మున్పిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొరుపూరి రాజు తన వాట్సాప్‌ ద్వారా కౌన్సిలర్‌ల వాట్సాప్‌ గ్రూప్‌లో కొన్ని అశ్లీల వీడియోలను పోస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంపై మంగళవారం మహిళా కౌన్సిలర్లు సుమారు పది మంది చైర్‌ పర్సన్‌ వద్దకు వెళ్లి వైస్‌ చైర్మన్‌ రాజు అçసభ్యకర వీడియోలు పోస్టింగ్‌ వ్యవహారంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. దీంతో చైర్మన్‌ స్పందిస్తూ అందరితో చర్చించి, మహిళలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిడంతో వారు వెనుదిరిగారు. ఇంతలో కొందరు ‘‘అలా జరగడం తప్పే కాదా! ఎంత సిగ్గుమాలిన పని అంటూ గుసగుసలాడుకుంటూ వస్తుండగా.. టీడీపీ 12వ వార్డు కౌన్సిలర్‌ బేదంపూడి సత్తిబాబు విని.. ‘‘మీ వీడియోలేమైనా పెట్టాడా?’’ అన్నాడు.

దీంతో మహిళా కౌన్సిలర్లు ఉల్లి మంగ, రాయవరపు వరలక్ష్మి, శెట్టి సుబ్బలక్ష్మి, వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ చల్లా సూర్యకుమారి, సీపీఎం కౌన్సిలర్‌ కూనిరెడ్డి అరుణ, కౌన్సిలర్లు గంగాభవానీ, కందుల కుమారి, తాళాబత్తుల ఉదయ కామేశ్వరి, తదితర మహిళా కౌన్సిలర్లు అతడి వ్యాఖ్యలపై మండిపడ్డారు. దీంతో మహిళా కౌన్సిలర్లు, బేదంపూడి సత్తిబాబు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మహిళలను గౌరవించాల్సిన అధికార పార్టీ కౌన్సిల్‌ సభ్యులు సాటి మహిళా కౌన్సిలర్లతో ఇలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని అందరూ ముక్కున వేలుసుకున్నారు. ఐద్వా నాయకులు కూనిరెడ్డి అరుణ, కౌన్సిలర్లు మంగ, వరలక్ష్మి, సూర్యకుమారి తదితరులు మాట్లాడుతూ సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించిన వైస్‌ చైర్మన్‌పై చర్యలు తీసుకుకోకపోగా, అతడికి వత్తాసు పలుకుతూ మహిళను కించపరచడం సరైన పద్ధతి కాదన్నారు. కౌన్సిలర్‌ సత్తిబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని, అలాగే వీసీని తొలగించాలని వారు డిమాండ్‌ చేశారు. దీనిపై అవరమైతే తాము ఉద్యమిస్తామన్నారు. మహిళలను ఇబ్బంది పెట్టే నేతలు తమ సిగ్గు తెలసుకునేంత వరకు ఉద్యమిస్తామని ఆరుణ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు