గుట్టువిప్పిన శేఖర్‌ చౌదరి...

25 Aug, 2019 20:45 IST|Sakshi

సాక్షి, విజయవాడ:  టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్ట్‌ శేఖర్‌ చౌదరి పోలీసుల విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో టీడీపీ ప్రముఖుల పేర్లను అతడు చెప్పినట్లు సమాచారం. తీగ లాగితే డొంక కదులుతున్నట్లుగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి తాను ఒక్కడినే కాదని, తమ లాంటి టీమ్‌లు చాలా పనిచేస్తున్నాయని శేఖర్‌చౌదరి గుట్టువిప్పినట్టు సమాచారం.

చదవండిపెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అరెస్ట్

టీడీపీ కోసం పనిచేసే తమలాంటి వారికి నెలవారీ వేతనాలు ఇచ్చి ప్రభుత్వంపై విమర్శలను రక్తికట్టించేలా వాడుకుంటున్నారని వివరించినట్టు తెలిసింది. ప్రతి విషయంలోను ప్రభుత్వంపై లేనిపోని విమర్శలతో ఆడియో, వీడియోలను రూపొందిస్తున్నామని అంగీకరించాడు. ప్రభుత్వంపై చేసే విమర్శలు, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మేలా చేసేందుకు సినీరంగానికి చెందిన కొందరు తమకు స్క్రిన్‌ప్లే, దర్శకత్వం చేస్తున్నారని చెప్పినట్టు తెలిసింది. 

రాష్ట్రంలోని తమలాంటి టీమ్‌లకు, సినీరంగానికి చెందిన వారికి టీడీపీ నేతలే నిర్మాతలు  అని పేర్లు వెల్లడించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి మంత్రులను అభాసుపాలు చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పెయిడ్‌ ఆర్టిస్టులకు కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం వహించిన వెనక ఉండి నడిపిస్తున్న టీడీపీ పెద్దల ఎవరనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా