కో ఆర్డినేటర్‌పై టీడీపీ వర్గీయుల దాడి

29 Jun, 2020 04:01 IST|Sakshi
తీవ్రంగా గాయపడిన గాదె బ్రహ్మారెడ్డి

రెంటచింతల(మాచర్ల): వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌పై టీడీపీ వర్గీయులు హత్యాయత్నానికి తెగబడ్డారు. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం పశర్లపాడు గ్రామానికి చెందిన గాదె బ్రహ్మారెడ్డి కొంతకాలంగా గుంటూరులో ఉంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం పశర్లపాడు నుంచి రెంటచింతలకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పిల్లివాగు సమీపంలో టీడీపీకి చెందిన నల్లబిరుదు నర్సింహారావు, అతని మేనల్లుడులు రాయంకుల నాగేశ్వరరావు, రాయంకుల రాజశేఖర్‌ కలిసి కర్రలు, గొడ్డలి, బరిసెలతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బ్రహ్మారెడ్డిని స్థానికులు గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బ్రహ్మారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చల్లా సురేష్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు