ఉపాధ్యాయుడి వికృత చర్య

7 Nov, 2019 07:56 IST|Sakshi

చెన్నై, వేలూరు: తండ్రాంబట్టు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు అసభ్యకర వీడియో చూపిస్తూ వేధిస్తున్న ఉపాధ్యాయుడిని బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా తండ్రాంబట్టు సమీపంలోని అత్తిపట్టు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఆరుగురు విద్యార్థినిలు, ఎనిమిది మంది బాలురు చదువుతున్నారు. హెచ్‌ఎంగా కృష్ణమూర్తి, టీచర్‌గా భువనలు పనిచేస్తున్నారు. గత రెండు నెలల క్రితం భువన ప్రసూతి సెలవుపై వెళ్లింది. ఆమె స్థానంలో మేల్‌పాక్కం ప్రభుత్వ పాఠశాల టీచర్‌ మదలముత్తను నియమించారు.

ఈయన ఈనెల 3వ తేదీ నుంచి పాఠశాల విధులకు వస్తున్నాడు. రెండు రోజుల క్రితం మదలముత్తు, హెచ్‌ఎం కృష్ణమూర్తితో కలిసి అసభ్య వీడియోలను చూపించి విద్యార్థినులను వేధించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని బయటకు చెబితే ఫెయిల్‌ చేస్తామని బెదిరించినట్లు విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన తల్లి దండ్రులు వీటిపై విచారించేందుకు పాఠశాలకు వెళ్లారు. ఆ సమయంలో కృష్ణమూర్తి, మదలముత్తు సెలవుపై వెళ్లడంతో డెప్యూటేషన్‌పై వచ్చిన ప్రకాష్‌ రాజ్‌ అనే టీచర్‌ ఉన్నాడు. ఆయన వద్ద విచా రించగా హెచ్‌ఎం ఐదు రోజుల ట్రైనింగ్‌ క్లాసులకు వెళ్లినట్లు, మదలముత్తు సెలవులో ఉన్నట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు వానా పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం మదలముత్తును అరెస్ట్‌ చేసి హెచ్‌ఎం కృష్ణమూర్తిపై కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు