లైంగిక వేధింపులు: ఉపాద్యాయుడిపై కేసు నమోదు

2 Dec, 2019 20:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వైఎస్సార్‌ కడప: పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చ తెచ్చిన సంఘటన ఇది. విద్యా బుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయుడే కామంతో కళ్లు మూసుకుపోయి పాఠశాలలో చదివే విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పులివెందుల పట్టణంలోని రవీంద్రనాథ ప్రభుత్వ పాఠశాలలోని 8వ తరగతి చదివే విద్యార్థినిపై కృష్ణనాయక్‌ అనే ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు