లక్కీ డ్రా అంటే 2.08 లక్షలు చెల్లించేశాడు..

23 Jul, 2020 07:19 IST|Sakshi

ఆన్‌లైన్‌ మోసంపై పోలీసులను ఆశ్రయించిన ఉపాధ్యాయుడు

కాకినాడ రూరల్‌: లక్కీ డ్రా ద్వారా రూ.25 లక్షలు గెలుచుకున్నారంటూ వాట్సాప్‌ కాల్‌ రావడంతో.. రూ.2.08 లక్షలు ఫోన్‌ పే ద్వారా చెల్లించిన ఒక ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు సర్పవరం పోలీసులను ఆశ్రయించాడు. లక్కీ డ్రా రాలేదని ఆన్‌లైన్‌ మోసానికి గురయ్యానని అతడు ఆలస్యంగా గుర్తించాడు. సీఐ గోవిందరాజు బుధవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. గుడారిగుంట శ్రీసాయి 40 బిల్డింగ్స్‌ శ్రీ వాసవి కుటీర్‌ వద్ద నివాసం ఉంటున్న లంక రవికుమార్‌ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.

జూన్‌ 29న ఉదయం 10 గంటలకు 70779 97542 నంబర్‌ నుంచి ఆకాశ వర్మ పేరుతో ఆయనకు వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. లక్కీ డ్రాలో రూ.25 లక్షలు గెలుచుకున్నారని, రిజిస్ట్రేషన్‌కు రూ.8 వేలు, మీడియాకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు రూ.2 లక్షలు చెల్లించాలని నమ్మబలికాడు. దీంతో రెండు వారాల్లో దఫాదఫాలుగా రూ.2.08 లక్షలు ఫోన్‌ పే ద్వారా చెల్లించారు. తరువాత రాణాప్రతాప్‌సింగ్‌ అనే పేరుతో రవికుమార్‌కు ఫోన్‌ చేసి ఇన్సురెన్స్‌ కోసం మరో రూ.65 వేలు చెల్లించాలని కోరడంతో అనుమానం వచ్చి స్నేహితులకు చెప్పాడు. చివరికి మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడికి న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా