బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

7 Jan, 2020 02:52 IST|Sakshi
ఉపాధ్యాయునిపై దాడికి ప్రయత్నిస్తున్న బాలిక తల్లి

నిందితుడిపై కేసు నమోదు 

జేసీ సంధ్యారాణి విచారణ 

బోథ్‌: దళిత బాలికపై ఓ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక 8 వ తరగతి చదువుతోంది. ఆదివారం తనను చూడటానికి వచ్చిన తల్లితో.. ఉపాధ్యాయుడు, ఇన్‌చార్జి వార్డెన్‌ వసంత్‌రావ్‌ కొద్ది రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని సదరు బాలిక వాపోయింది. దీంతో సోమవారం బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఉపాధ్యాయుడిని నిలదీశారు. అతడిపై దాడికి యత్నించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్‌ తెలిపారు.  

ఎమ్మార్పీఎస్‌ ధర్నా: విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. కీచక ఉపాధ్యాయుడు వసంత్‌రావును వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడాల స్వామి డిమాండ్‌ చేశారు. వారం రోజుల్లో విచారణ చేపట్టి సంబంధిత ఉపాధ్యాయుడిపై తగు చర్యలు తీసుకుంటామని పీవో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అలాగే.. ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. 

విచారణ చేపట్టిన జేసీ సంధ్యారాణి: పల్లె ప్రగతిలో భాగంగా బోథ్‌ మండల కేంద్రంలో పర్యటిస్తున్న జేసీ సంధ్యారాణికి విషయం తెలియడంతో వెంటనే పాఠశాలకు వెళ్లి బాధిత బాలికతో పాటు, తోటి బాలికలను విచారించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రవర్తనపై ఆరా తీశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ 175 కోట్ల విలువైన హెరాయిన్‌ సీజ్‌

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమని పెప్పర్ స్ప్రేతో దాడి: సీపీ

బతుకు జీవుడా..!

జైలుకు లంచగొండి ఐఏఎస్‌ అధికారి

దొంగల హల్‌చల్‌

ఆపరేషన్‌ ద్వారా మహిళగా మారి.. ఆపై

భార్యపై హత్యాయత్నం

‘పాపా’గ్ని ఒడిలో..!

ఛీఛీ.. బాలికపై పోలీస్‌ బాస్‌ లైంగిక దాడి

జోమాటోకి కాల్‌ చేస్తే రూ.70 వేలు స్వాహా

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కోసం ముమ్మర గాలింపు

'ఆయన ముక్కు బాలేదు.. నాకీ పెళ్లొద్దు'

తల్లి, కూతురు అదృశ్యం

పోకిరీకి యువతి చెప్పుతో సమాధానం..

చిన్నారావు..చిక్కాడు!

బాలికపై ఇద్దరు యువకుల దాష్టీకం

రైలులో చిన్న వివాదం ఎంత పనిచేసింది?

'చిరుద్యోగి నుంచి ఏడాదికి రూ.20కోట్ల టర్నోవర్‌కు'

సీఎం కార్యాలయ ఆదేశాలు బేఖాతరు 

రైలులో ఉన్మాది వీరంగం

విశాఖలో బస్సు దగ్ధం

బొకారో ఎక్స్‌ప్రెస్‌లో దారుణం..!

మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై లైంగిక వేధింపులు

ఇసుక మాఫీయా.. సామాజిక కార్యకర్త దారుణ హత్య

కట్నం కోసం వేధింపు.. ప్రేమికుడిపై క్రిమినల్‌ కేసు

వివాహేతర సంబంధం.. చెన్నై వ్యక్తి ఆంధ్రలో శవం

రామోజీరావు బంధువు కేసులో బయటపడ్డ వాస్తవాలు

శ్రీకాకుళం జిల్లాలో టూరిస్ట్ బస్ దగ్ధం

మరొకరితో సన్నిహితం.. లైంగిక దాడి, హత్య

హనీట్రాప్‌లో మరో ముగ్గురు నేవీ ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అల.. వైకుంఠపురములో ట్రైలర్ విడుదల

డ్యాన్స్‌తో అదరగొట్టిన కత్రినా కైఫ్‌

మోదీని కలిసిన మోహన్‌బాబు ఫ్యామిలీ

వేదికపైనే కన్నీరు పెట్టుకున్న హీరో సూర్య

జీన్స్‌ వేసుకుంటే ట్రాన్స్‌జెండర్లు పుడతారు

పర్ఫెక్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌..!