‘లెక్క’ తప్పిందా.. సొత్తు గోవిందా!

29 Oct, 2018 08:10 IST|Sakshi
బిజినేపల్లి మండలం అల్లీపూర్‌ చెక్‌పోస్టు వద్ద అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు (ఫైల్‌)

నాగర్‌కర్నూల్‌ క్రైం: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే బెల్టు షాపులపై జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించి పలువురు బెల్టుషాపుల నిర్వాహకులను బైండోవర్‌ చేశారు. అధికారులు చెక్‌పోస్టుల వద్ద, బ్యాంకు ఖాతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. గత వారం రోజుల క్రితం నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలోని బిజినేపల్లి మండలం అల్లీపూర్‌ గేటు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యాపారి వాహనం నుంచి రూ.33,72,330 నగదు పట్టుబడటంతో తరలింపుపై నిఘా తీవ్రతరం చేశారు.
 
వ్యాపారుల్లో ఆందోళన 
ఎన్నికల సీజన్‌ కావడంతో వ్యాపారులు, ప్రజలు నగదును ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాలంటే జంకుతున్నారు. వ్యాపారులు చాలా వరకు బ్యాం కు చెల్లింపుల ద్వారానే వ్యాపార లావాదేవీ లు కొనసాగిస్తున్నారు. ఆస్పత్రులకు, షాపింగ్‌లు, ఇతర అవసరాల కోసం ప్రజలు నగదును తీసుకువెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నగదుకు సంబంధించి ఆధారాలను చూయిస్తేనే వాటిని సీజ్‌ చేయమని అధికారులు చెబుతున్నా చాలామందికి ఆ విషయాలు తెలియక నగదుకు సంబంధించిన రశీదులు తీసుకువెళ్లలేక ఆందోళన చెందుతున్నారు.

లావాదేవీలపై సమాచార సేకరణ 
ఎన్నికలలో ఓటర్లకు నగదు పంచి ప్రలోబాలకు గురిచేసే అవకాశం ఉన్నందున నగదు తరలింపు పై నిఘా పెంచిన అధికారులు బ్యాంకు ఖా తాలపై దృష్టిసారించారు. అభ్యర్థులు నగదును నే రుగా కాకుండా బ్యాంకుల ద్వారా లావాదేవీలు జ రుపుతారనే ఉద్దేశంతో కొద్దిరోజుల నుంచి బ్యాం కుల్లో రూ.లక్షల్లో జరిగిన లావాదేవీలపై ఆదాయ పు పన్ను శాఖ, ఎన్నికల అధికారులుç Üసమాచా రం సేకరిస్తున్నట్లు తెలిసింది. గ్రామాల్లో మహిళా సంఘాలు అధికంగా ఉండటంతో వారు రూ.లక్ష ల్లో రుణాలు తీసుకుంటుంటారు. అభ్యర్థులు మ హిళా సంఘాలను  ప్రభావితం చేయకుండా ఉం డేందుకు వారి ఖాతాల్లో ఇటీవల జరిగిన నగదు లావాదేవీల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. 

పూర్తి ఆధారాలతో.. 

  • ఏ వ్యక్తి అయిన సొంత అవసరాలకు, వ్యా పార లావాదేవీల కోసం, షాపింగ్‌లకు ఇలా ఏ అవసరం నిమిత్తం నగదు తీసుకువెళ్తున్నామనే ఆధారాలను అధికారులకు చూయిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లవచ్చు. 
  • తనిఖీలలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే ఆ నగదుకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తారు. సరైన ఆధారాలు చూయించకపోతే సీజ్‌చేసి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అప్పగిస్తారు. సదరు అధికారి నగదును జిల్లా ఎన్నికల మానిటరింగ్‌ కమిటీ విచారణ చేసి సరైన ఆధారాలు చూయించకుంటే ట్రెజరీలో డిపాజిట్‌ చేసి కోర్టులో కేసు వేస్తారు. 
  • తనిఖీలలో రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు పట్టుకుంటే ఆ నగదును సీజ్‌ చేసి జిల్లా ఎన్నికల అధికారికి అందజేయాలి. జిల్లా ఎన్నికల అధికారి  ఆ నగదును ఎస్టీఓలో జమ చేసి ఆదాయ శాఖాధికారులకు సమాచారం ఇస్తే నగదు పట్టుబడిన వ్యక్తికి ఆదాయశాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. నగదుకు సంబంధించిన వ్యక్తి ఐటీ రిటరŠన్స్, సరైన ఆధారాలు చూయించి నగదు తీసుకెళ్లాల్సి ఉంటుంది. 
  • నగదు తరలింపునకు ప్రత్యామ్నాయంగా చెక్కులు జారీచేసే అవకాశం ఉంది. చెక్కులను అకౌంట్‌లో జమ కావడానికి చాలారోజులు పడుతుంది అనుకుంటే బ్యాంకుల నుంచి డిమాండ్‌ డ్రాఫ్ట్‌లను తీసుకునే అవకాశం ఉంది. 

ఆధారాలు చూయించాలి 
ఎన్నికల కోడ్‌ ఉన్నందున రూ.50 వేల కంటే ఎక్కువ నగదు వెంట తీసుకువెళితే నగదుకు సంబంధించిన ఆధారాలు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలలో నగదుకు సంబంధించిన ఆధారాలు చూయించి అధికారులకు సహకరించాలి. ఎవరైనా సరైన ఆధారాలు చూయించకుంటే సీజ్‌ చేసి ట్రెజరీ కార్యాలయంలో జమ చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – హన్మానాయక్, ఆర్డీఓ, 
ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, నాగర్‌కర్నూల్‌  

>
మరిన్ని వార్తలు