36 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు

20 Dec, 2019 03:16 IST|Sakshi

ప్రభుత్వం ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలపై అత్యాచార కేసుల విచార ణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశా రు. పిల్లలు, మహిళలపై అత్యాచా రా లు, పోస్కో చట్టాల కింద నమోదయ్యే కేసులను సత్వరమే విచారించి నిందితులకు శిక్షలు ఖరారు చేసేందు కు వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఆదిలాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్‌(కోర్టు సంగారెడ్డిలో ఉంటుంది), నల్లగొండ, నిజా మాబాద్, రంగారెడ్డి (ఎల్‌బీ న గర్‌), వరంగల్, ఆసిఫాబాద్, మంచి ర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కొత్తగూడెం, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, మెదక్, సూర్యాపేట, భువనగిరి, కామారెడ్డి, మల్కాజిగిరి, జనగాం, భూపాల్‌పల్లి, మహబూబాబాద్, ములుగు, షాద్‌నగర్, మేడ్చల్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌ల్లో ఒక్కో కోర్టు చొప్పున 32 కోర్టులు ఏర్పాటు చేశారు. ఖమ్మం, కరీంనగర్‌ల్లో రెండేసి కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు