పాఠాలు చెప్పమని వస్తే...

2 Jan, 2019 09:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అయోధ్యలోని ఆలయ పూజారి అరెస్టు

ఆధ్యాత్మిక బోధనల పేరుతో మహిళపై అఘాయిత్యం

అయోధ్య : ఆధ్యాత్మిక బోధనలు విందామని వచ్చిన భక్తురాలిపై అయోధ్యలోని ఓ ఆలయ పూజారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంచివాడిగా నటిస్తూ దేవుడి సన్నిధిలో కామంధుడి రూపం దాల్చాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కటకటకాల పాలయ్యాడు. వివరాలు.. అయోధ్యలోని ఓ దేవాలయంలో ప్రధాన పూజారిగా పనిచేస్తున్న కృష్ణకాంతాచార్య దగ్గర ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుందామని వారణాసికి చెందిన ఓ మహిళ (30) డిసెంబర్‌ 24న వచ్చారు. బయటకు వెళ్తే బోధనలకు ఇబ్బంది అవుతుందనీ, ఆలయ పరిసరాల్లోని ఓ గదిలో ఉండాలని పూజారి నమ్మబలికాడు. ఆపై ఆమెను లోబరుచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం గోప్యంగా ఉంచేందుకు ఆమెను బయటకు రాకుండా ప్రతిఘటించాడు. ఎలాగోలా బాధితురాలు పోలీసులకు ఫోన్‌ చేసి విషయం చెప్పడంతో ఆమెను రక్షించారు. పూజారి కృష్ణకాంతాచార్యను మంగళవారం అరెస్టు చేశారు. బాధితురాలిని  మెడికల్‌ పరీక్షల కోసం పంపంచామని సీఐ ఏకే.సావ్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు