కలవరపెట్టిన చిన్నారుల అదృశ్యం

22 Feb, 2019 13:29 IST|Sakshi
ఏటూరు గ్రామంలో బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

చేపలు పట్టే దారాలు, గాలాలు కొనుక్కుని బయటకు వెళ్లిన ముగ్గురు బాలురు

గంటల వ్యవధిలోనే ఆచూకీని కనిపెట్టిన పోలీసులు

చందర్లపాడు (నందిగామ) : మండలంలోని ఏటూరు గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారన్న ఘటన అందరినీ కలవరా నికి గురి చేసింది.  అయితే, రంగ ప్రవేశం చేసిన పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే పిల్లల ఆచూకీని కనిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చు కున్నారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెం దిన ఇల్లా దుర్గాప్రసాదు (13), యాటగిరి చైతన్య (8), ఇల్లా ఈశ్వర్‌ (7) స్నేహితులు.  దుర్గాప్రసాదు స్థానిక ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చైతన్య ఎంపీపీఎస్‌ (ఎస్టీ) లో 3వ తరగతి చదువుతున్నాడు. ఒకటో తరగతిలో చేరాల్సిన ఈశ్వర్‌ స్థానిక (ఎస్టీ) పాఠశాలకు వెళ్తు న్నాడు. అయితే, బుధవారం ఉదయం తల్లిదండ్రులు పనులకు వెళ్లిన తర్వాత వీరు పాఠశాలకు వెళ్లకుండా చేపలు పట్టే దారాలు, గాలాలను కొనుక్కుని బయటకు వెళ్లారు. చీకటి పడుతున్నా ఇం టికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు.

ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియకపోవ డంతో చందర్లపాడు పోలీసులకు సమాచారమి చ్చారు. సీఐ సతీష్, చందర్లపాడు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం, ట్రైనీ ఎస్‌ఐ రామగణేష్‌ హుటా హుటిన ఏటూరు గ్రామానికి వెళ్లారు. కుటుంబ సభ్యుల ను, స్నేహితులను విచారించారు. అయితే, బుధవారం ఉదయం ముగ్గురూ పాఠశాలకు వెళ్లకుండా గ్రామంలోని కిరాణా షాపులో చేపల గాలాలకు వేసే వైరును కొన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. అలాగే, బుధవారం తోటరావులపాడు గ్రామంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బృందాలుగా ఏర్పడి వెతుకులాట పారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సమయంలో పిల్లలు ముగ్గురు కంచికచర్లలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద వారు తచ్చాడుతుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి పిల్లల్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు.

తల్లిదండ్రులకు అప్పగింత
కంచికచర్ల : తప్పిపోయిన ముగ్గురు పిల్లల ఆచూకీని తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకుని గురువారం రాత్రి స్టేషన్‌కు తరలించారు. కంచికచర్ల సీఐ కార్యాలయంలో పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.  కొన్ని గంటల వ్యవధిలోనే తమ కుమారుల ఆచూకీ తెలుసుకున్న పోలీసులకు పిల్లల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నందిగామ డీఎస్పీ సుబాస్‌ చంద్రబోస్, సర్కిల్‌ సీఐ కే సతీష్, ఎస్‌ఐలు మణికుమార్, సుబ్రహ్మణ్యం హెచ్‌కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు