బావిలో శవమైన టెన్త్‌ బాలిక

6 Feb, 2019 11:57 IST|Sakshi
పవిత్ర మృతదేహం

కర్ణాటక, క్రిష్ణగిరి: యువతి అనుమానాస్పద స్థితిలో బావిలోపడి మరణించిన సంఘటన మంగవారం ఉదయం జరిగింది. సూళగిరి తాలూక కానలట్టి గ్రామానికి చెందిన నారాయణప్ప గోవిందమ్మ దంపతులకు నలుగురు కూతుర్లు. వీరి రెండవ కూతురు పవిత్ర (15). అనుమానాస్పద స్థితిలో మారండపల్లి సమీపంలోని కావేరి గ్రామంలో తాత ఇంటికెళ్లి పక్కనున్న బావిలో పడి మరణించింది. మంగళవారం ఉదయం ఇంటి నుండి పవిత్ర బయటకెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో తల్లి గోవిందమ్మ పవిత్రకోసం వెతకసాగింది.

సమీపంలో వెంకటరాజుకు చెందిన బావిలో శవమై తేలింది. సూళగిరి పోలీసులు సంఘటనా స్థలానికెళ్లి శవాన్ని స్వాధీనం చేసుకొని హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. పవిత్ర కానలట్టి గ్రామంలో 10వ తరగతి చదువుతుందని బంధువులు తెలిపారు. ప్రమాదవశాత్తు బావిలో పడిందా ? లేక  ఆత్మహత్య చేసుకొందా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు