‘పది’లో ఫెయిలయ్యానని ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థిని

7 Jun, 2018 11:51 IST|Sakshi
గంగామణి(15)

ఇంద్రవెల్లి(ఖానాపూర్‌) మంచిర్యాల : పదో తరగతిలో పెయిల్‌ అయినందుకు మనస్థాపం చెందిన ఓ విద్యార్థిని బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. మండలంలోని కేస్లాపూర్‌ గ్రామానికి చెందిన మెస్రం లక్ష్మణ్, రత్నాబాయి దంపతులకు చెందిన గంగామణి(15) కేస్లాపూర్‌ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదివింది. మార్చిలో పరీక్ష రాసింది.

ఇందులో ఫెయిల్‌ కావడంతో రోజు బాధపడుతూ ఉండేది. మనస్థాపంతో మంగళవారం బహిర్భూమికి వెళ్లివస్తానని చెప్పి కనిపించకుండాపోయింది. పలు చోట్ల ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో  కుటుంబీకులు బుధవారం ఇంద్రవెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరికిల్ల గంగారాం తెలిపారు.  

మరిన్ని వార్తలు