కేంద్రమంత్రి కంప్యూటర్‌ డేటా చోరీ

3 Oct, 2019 11:48 IST|Sakshi
కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ (ఫైల్‌ ఫోటో)

రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇంట్లో చోరీ

మూడేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న యువకుడే నిందితుడు

సాక్షి, ముంబై : కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఇంట్లో చోరీ వెలుగులోకి వచ్చింది. నమ్మకంగా వుంటూనే గత మూడేళ్లుగా గోయల్ నివాసం(ముంబైలోని నేపీన్సీ రోడ్‌లోని ఖరీదైన ఎత్తైన విల్లా ఓర్బ్‌)లో పనిచేస్తున్న విష్ణుకుమార్ విశ్వకర్మ (28)ఈ చోరీకి పాల్పడ్డాడు. గత నెల (సెప్టెంబరు) 16 -18 మధ్య మంత్రి ఇంట్లోని వెండి, ఇతర విలువైన వస్తువులు మాయం కావడంతో ఆయన  కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.  

కేసు నమోదు చేసిన అధికారులు నిందితుడిని అదుపులోకి  తీసుకొచి కూపీ లాగగా గుట్టు రట్టయింది. గోయల్‌ వ్యక్తిగత కంప్యూటర్‌లోని అధికారిక రహస్య పత్రాలను విష్ణుకుమార్ చోరీ చేసినట్టుగా  పోలీసులు గుర్తించారు. దీంతో అతని మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కూడా విచారణ మొదలుపెట్టారు. కంప్యూటర్‌ నుంచి ముఖ్యమైన ప్రభుత్వ డేటాను చోరీ చేసి ఆ రహస్య ఫైళ్లను గుర్తు తెలియని వ్యక్తులకు ఈమెయిల్ చేశాడు. అంతేకాదు ఈమెయిల్ చేసిన అనంతరం తన ఫోన్‌లోని సమాచారాన్ని విష్ణుకుమార్ డిలీట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ‍్యవహారంలో నిందితుడు కాల్‌ డేటాను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. మంత్రి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీ అయిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 

>
మరిన్ని వార్తలు