రూ.15 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

4 Apr, 2018 11:53 IST|Sakshi
మాదక ద్రవ్యాలతో పట్టుబడిన జింబాబ్వే మహిళ..అంతర చిత్రంలో బ్యాగులో బయటపడిన 3 కిలోల మాదకద్రవ్యాలు

న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాలతో ఓ జింబాబ్వే దేశీయురాలు ఢిల్లీ ఎయిర్ట్‌పోర్టులో పట్టుబడింది.  పట్టుబడిన డ్రగ్స్‌విలువ రూ.15 కోట్లు ఉంటుందని, ఆమె గోవా మీదుగా ఫిలిఫ్పైన్స్‌లోని మనీలాకు అక్రమంగా సరఫరా చేసేందుకు ప్రయత్నం చేస్తూ పట్టుబడిందని భద్రతా అధికారులు తెలిపారు. ఓ విదేశీయురాలి వద్ద మాదక ద్రవ్యాలు ఉన్నాయని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారుల నుంచి సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అధికారులకు సమాచారం రావడంతో ఈ విషయం పడింది. జింబాబ్వేకు చెందిన బెట్టీ రేమ్‌ అనే మహిళ ఏప్రిల్‌ 2న  ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో గోవాకు వెళ్లడానికి విమానం ఎక్కేందుకు డిపార్చర్‌ టెర్మినల్‌ చేరుకుంది. మూడో నెంబర్‌ గేటు వద్దకు రాగానే భద్రతా అధికారులకు అనుమానం వచ్చి ఆమెను ఆపేశారు.

ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను చెక్‌ చేసేందుకు ఎక్స్‌-బిస్‌ మెషిన్‌ ద్వారా పంపించగా అనుమానాస్పదంగా బ్యాగ్‌లో ఓ పదార్థం కనిపించింది. దీంతో అధికారులు బ్యాగును తెరిచి చూడగా 3 కిలోల బరువున్న ప్యాకెట్‌ ఉంది. పరిశీలించి చూడగా పాపులర్‌ పార్టీ డ్రగ్‌ మెతమ్‌ఫెటమైన్‌గా తేల్చారు.  ఈ డ్రగ్‌ను ఐస్‌ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత ఆమెను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులకు విచారణ నిమిత్తం అప్పగించారు. ఈ డ్రగ్స్‌ను ఓ ఆఫ్రికన్‌ నుంచి తీసుకున్నట్లు విచారణలో తెలిపింది. ఆమె జింబాబ్వే నుంచి ముంబాయికి మార్చి 20న వచ్చింది. అంతకుముందు గతేడాది నవంబర్‌లో కూడా భారత్‌ను సందర్శించింది. మెతమ్‌ఫెటమైన్‌ అనే డ్రగ్‌ను ఎపిడ్రిన్‌ అనే డ్రగ్‌ నుంచి తయారు చేస్తారు. దీనికి ఇండియాతో పాటు పలుదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది.

మరిన్ని వార్తలు