యాప్‌తో ఆటకట్టు

24 Jan, 2018 12:01 IST|Sakshi
సీసీ ఫుటేజీలో కనిపిస్తున్న దొంగ

ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ద్వారా దొంగ గుర్తింపు, అరెస్ట్‌

కర్నూలు: లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఎల్‌హెచ్‌ఎంఎస్‌) ద్వారా  పోలీసులు జిల్లాలో తొలిసారిగా ఓ దొంగను గుర్తించి అరెస్ట్‌ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నగర శివారులోని గుత్తి పెట్రోల్‌ బంకు సమీపంలోని శ్రీరామ కాలనీలో నివాసముంటున్న సీతారామయ్య రెండు వారాల క్రితం ఇంటికి తాళం వేసి అనంతపురం వెళ్లాడు. ఆయన కోరిక మేరకు ఇంట్లో ఎల్‌హెచ్‌ఎంఎస్‌ కెమెరాను ఏర్పాటు చేశారు. దొంగ ఇంట్లోకి దూరగానే కంట్రోల్‌ రూమ్‌లో బజర్‌ మోగింది. ఘటన స్థలాన్ని సమీపిస్తుండగానే పోలీసు వాహనం సైరన్‌ శబ్దాన్ని దొంగ గుర్తు పట్టి గోడదూకి పారిపోయాడు. ఈనెల 8న నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఇంటి యజమాని సీతారామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై 457, 380 రెడ్‌ విత్‌ 511, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా బుధవారపేటకు చెందిన పాత నేరస్తుడు కాశెపోగు అశోక్‌ను నిందితుడిగా గుర్తించారు. మంగళవారం కృష్ణానగర్‌ జంక్షన్‌లో తిరుగుతుండగా బ్లూ కోల్ట్సŠ, క్యూఆర్టీ సిబ్బంది అరెస్ట్‌ చేశారు.  

కంట్రోల్‌ రూమ్‌ తనిఖీ
రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పై అంతస్తులో సీసీ కెమెరాల కంట్రోల్‌ రూమ్‌లో లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను ఎస్పీ గోపీనాథ్‌ జట్టి మంగళవారం తనిఖీ చేశారు. కమాండ్‌ కంట్రోల్‌లో ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అదనంగా రెండు సీసీ కెమెరాల మానిటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. డీఎస్పీలు బాబుప్రసాద్, ఖాదర్‌ బాషా, సీఐలు డేగల ప్రభాకర్, దివాకర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, గుణశేఖర్, ఎస్‌ఐ తిమ్మారెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు