దొంగల తెలివి.. కొత్త తరహాలో ఏటీఎం చోరీ

4 Mar, 2020 14:41 IST|Sakshi
చోరీకి గురైన యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎం

సాక్షి, హైదరాబాద్‌ : రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో దొంగలు భీభత్సం సృష్టించారు. ఏటీఏం మిషిన్‌ను కట్‌చేసి డబ్బు దోచుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున హయత్ నగర్లోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషిన్‌ను కట్ చేసి, మిషన్లో ఉన్న లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. మొదటిసారి కొత్త తరహాలో ఏటీఎం మిషన్‌లోంచి డబ్బులు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా, గత జనవరి నెలలో అనంతపురం జిల్లా పెనుగొండలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశాడు. మొదట ముఖానికి ముసుగు తొడుక్కొని వచ్చిన దొంగ ఏటీఎంలోకి ప్రవేశించి.. ఏటీఎం మెషిన్‌ ఎక్కి మరీ.. అక్కడ ఉన్న సీసీటీటీ కెమెరాకు ముసుగు కప్పేశాడు. ఆ తర్వాత ఏటీఎం మెషిన్‌ నుంచి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం ఏకంగా గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేశాడు. అయినా, ఏటీఎం క్యాష్ బాక్స్ తెరుచుకోలేదు. దీనికితోడు గ్యాస్‌ కట్టర్ల కారణంగా ఏటీఎం మెషిన్‌ నుంచి మంటలు వచ్చాయి. దీంతో భయభ్రాంతులకు గురైన దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. 

మరిన్ని వార్తలు