దొంగల హల్‌చల్‌

9 Mar, 2020 10:53 IST|Sakshi
గ్రామంలో విచారణ చేపడుతున్న పోలీసులు

పోతులబోగూడలో రెచ్చిపోయిన దొంగలు

తాళం వేసిన 5 ఇళ్లు, రెండు దుకాణాల్లో చోరీ

బంగారం, నగదు అపహరణ

రోడ్డు ప్రమాదానికి గురై పట్టుబడ్డ వైనం

శివ్వంపేట(నర్సాపూర్‌): తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసిన దొంగలు అందుకు అనుగునంగా చోరీకి పాల్పడిన సంఘటన మండల పరిధి పోతులబోగూడ గ్రామంలో శనివారం ఆర్థరాత్రి చోటుచేసుకుంది. తాళం వేసి ఉన్న 5 ఇళ్లతో పాటు రెండు కిరాణ దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. చోరీలో లభ్యమైన నగదు, బంగారం వెంట తీసుకెళ్లిన దొంగలు పలు సామగ్రిని గ్రామ శివారులో పడేసి వెళ్లారు. తాళాలను పగలగొట్టి చోరీకి పాల్పడడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. అందుకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం....

చాపల భూదమ్మ బంధువులకు సంబంధించిన వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురికాగా పరామర్శించేందుకు వెళ్లారు. వీరి ఇంటి ప్రధాన ద్వారం గడపను తొలగించి ఇంట్లోని మూడు  అల్మారాలను ధ్వసం చేసి అందులోని  తులం బంగారం, 65 వేల నగదు, బట్టలు చోరీ చేశారు. పత్రాల ముత్యలుగౌడ్‌ ఇంట్లో 35 వేల నగదు పలు సామగ్రి చోరీ కాగా, బాలేష్‌గౌడ్‌ ఇంట్లో డబ్బులు, కుమ్మరి నర్సింలు ఇంట్లో  బియ్యంతో పాటు ఇతర సామగ్రి,  సీహెచ్‌ రాజుగౌడ్‌ ఇంట్లో చోరీ కాగా వారు అందుబాటులో లేకపోవడంతో చోరీ ఎంత జరిగిందో తెలియలేదు. భిక్షపతికి చెందిన ట్రాక్టర్‌ ఆరుబయట నిలిపి ఉంచగా బ్యాటరీ చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. పత్రాల ప్రశాంత్‌గౌడ్, సీహెచ్‌ శంకర్‌గౌడ్‌ లకు చెందిన కిరాణం డబ్బుల తాళాలు పగలగొట్టి అందులోని పలు సామగ్రి, నగదు ఎత్తుకెళ్లారు. కిరాణం డబ్బాలో ఉన్న మద్యం చోరీ చేసి పుల్లుగా తాగారు. అనంతరం  చోరీకి పాల్పడిన పలు వస్తువులను గ్రామ శివారులో పడేసి నగదు, బంగారంతో బైక్‌పై ఉడాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకోని చోరీకి సంబంధించి వివరాలు సేకరించారు. 10 గంటల ప్రాంతంలో గ్రామానికి  పోలీసుల పెట్రోలింగ్‌  వాహనం వెళ్లడం జరిగిందని ఏఎస్‌ఐ నయూమ్‌ ఉధ్దీన్‌ అన్నారు.

పోలీసులు అదుపులో దొంగలు
చోరీకి పాల్పడిన దొంగలు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. పోతులబోగూడలో చోరీకి పాల్పడిన అనంతరం మద్యం సేవించి ముగ్గురు దొంగలు బైక్‌ పై పారిపోతున్న  క్రమంలో వెల్దుర్తి గ్రామ శివారులో అదుపుతప్పి పడిపోయారు. ఇందులో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు గాకా గుర్తించిన పోలీసులు వారిని విచారించగా చోరీ విషయం చెప్పాడు.  వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్‌ గ్రామానికి చెందిన శేఖర్, కొల్చారం మండలం నాయిల్‌ జలాల్‌పూర్‌కు చెందిన కృష్ణ పోలీసులు అదుపులోకి తీసుకోగా, వెల్దుర్తి మండలం అరెంగూడ గ్రామానికి చెందిన లక్ష్మయ్యకు గాయాలు కాగా అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఇన్‌చార్జి వెల్దుర్తి ఎస్‌ఐ గంగారాజు తెలిపారు. చోరీకి సంబంధించి పూర్తి స్ధాయి విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. చోరీకి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు