అతివేగమే మింగేసింది..

26 Jan, 2019 13:51 IST|Sakshi
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజమండ్రి నుంచి వస్తున్న కారు హనుమాన్‌జంక్షన్‌ ప్రధాన కూడలి దాటిన తర్వాత కోడూరుపాడు సమీపంలోని సర్కార్‌ జూట్‌ మిల్‌ వద్ద అదుపు తప్పి హైవే డివైడర్‌ను దాటి అవతలి వైపు రోడ్డులో వస్తున్న లారీని ఢీకొట్టింది.

కృష్ణాజిల్లా, హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌(గన్నవరం): జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వివరాలు.. రాజమహేంద్రవరం నుంచి ఇన్నోవా కారులో గురువారం రాత్రి డ్రైవర్‌ బుద్ధి వెంకటేశ్వరరావు అలియాస్‌ శ్రీను అతడి స్నేహితుడు బొడ్డు రాంబాబుతో కలసి విజయవాడ బయలుదేరాడు. విజయవాడ వెళ్లేందుకు  రావులపాలెం బస్టాండ్‌ వద్ద ఎదురుచూస్తున్న ప్రయాణికులు గుంతక్‌ సంఘమేశ్వర్, శ్రీనివాసరావు, రమణారావు, జాషువను కారు ఎక్కించుకున్నారు. వాహనం హనుమాన్‌జంక్షన్‌ ప్రధాన కూడలి దాటిన తరువాత కోడూరుపాడు సమీపంలోని సర్కార్‌ జూట్‌ మిల్స్‌ వద్ద అదుపు తప్పి హైవే డివైడర్‌ను దాటి అవతలి వైపు రోడ్డులో వస్తున్న లారీని ఢీకొట్టింది. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.

ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న డ్రైవర్‌ బుద్ధి వెంకటేశ్వరరావు (25), తూర్పుగోదావరి జిల్లా రాయవరానికి చెందిన అతడి స్నేహితుడు బొడ్డు రాంబాబు(22), కారులో ప్రయాణిస్తున్న తెలంగాణ రాష్ట్రం బాన్సువాడకు చెందిన గుంతక్‌ సంఘమేశ్వర్‌ (23) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. విజయవాడ కోమలవిలాస్‌ సెంటర్‌కు చెందిన శ్రీనివాసరావు, రావులపాలేనికి చెందిన రమణారావు, గుంటూరు ఏటీ అగ్రహారంకు చెందిన జాషువా ఐన్‌స్టీన్‌ గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న హనుమాన్‌జంక్షన్‌ సీఐ ఎన్‌.రాజశేఖర్, వీరవల్లి ఎస్‌ఐ చంటిబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

నిద్ర మత్తులో ప్రమాదం..
నిద్ర మత్తులో మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా వాహానాన్ని నడపటం వలనే రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వాస్తవానికి ఇన్నోవా కారును విజయవాడలో అప్పగించేందుకు బయలు దేరిన డ్రైవర్‌ వెంకటేశ్వరరావు తోడుగా స్నేహితుడు రాంబాబును వెంట పెట్టుకుని బయలు దేరాడు. కారు ఖాళీగా ఉండటంతో డబ్బులు వస్తాయనే ఆశతో మార్గమధ్యంలో ప్రయాణికులను ఎక్కించుకున్నారు. డ్రైవర్‌ వెంకటేశ్వరరావు నిర్లక్ష్యం తన పాటు మరో ఇద్దరు ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనపై వీరవల్లి ఎస్‌ఐ చంటిబాబు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

రాజధానిలో రౌడీ గ్యాంగ్‌!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధుడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌