అగ్నిప్రమాదంలో ముగ్గురి సజీవదహనం

16 Oct, 2017 13:28 IST|Sakshi

మీర్జాపూర్‌: షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఇంట్లో  జరిగిన అగ్నిప్రమాదంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలు సజీవదహనమయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌ జిల్లా కొల్హాన్‌ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షీల(30) తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా.. ప్రమాదవశాత్తు ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి.

పిల్లలతో కలిసి బయటకు రావడానికి యత్నించినా సాధ్యపడకపోవడంతో మంటల్లో చిక్కుకొని ముగ్గురు సజీవదహనమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు