రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థుల మృతి

12 Nov, 2019 03:05 IST|Sakshi
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

మృతులు హైదరాబాద్‌ వాసులుగా గుర్తింపు

సూర్యాపేట జిల్లా ఇందిరానగర్‌ వద్ద ఘటన

మునగాల(కోదాడ): అతివేగం ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. విహారయాత్ర.. విషాదాంతమైంది. మొత్తం 16 మంది విద్యార్థులు.. 2 కార్లలో ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల బీచ్‌కు విహారయాత్రకు వెళ్లారు. రాత్రి కావడంతో తిరుగుపయనమయ్యారు. అంతలో వీరు ప్రయాణిస్తున్న ఓ కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడే మృతిచెందగా, మరొకరు సూర్యాపేట ఏరియా ఆస్పత్రి లో చనిపోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యా యి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్‌ శివారులోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌ ఇబ్రహీంపట్నంలో ఉన్న గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్న 16 మంది విద్యార్థులు ఆదివారం గుంటూరు జిల్లా బాపట్లకు 2 కార్లలో వెళ్లారు. తిరిగి సోమవారం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఒక కారులో ఏడుగురు, మరో కారులో 9మంది ఉన్నారు. ఏడు గురు ఉన్న మరో కారు మునగాల మండలం ఇందిరానగర్‌ శివారులోకి రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో హర్ష (24) అనే విద్యార్థి కారు నుంచి ఎగిరి రోడ్డుపై పడి చనిపోయాడు. డ్రైవింగ్‌ చేస్తున్న రేవంత్‌ (24) కారులోనే ఇరుక్కుపోయి మృతిచెందాడు. మరో విద్యార్థి శశాంక్‌ (26)ను సూర్యా పేట ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించి మృతిచెందాడు. కారులో ప్రయా ణిస్తున్న ప్రణీత్, ఆసిఫ్, అజయ్, నిఖిల్‌ అనే విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యా యి. వీరికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌ తరలించారు. మృతుల్లో రేవంత్‌ది హైదరాబాద్‌లోని చంపాపేట్‌ కాగా, హర్ష బాలాపూర్, శశాంక్‌ సికింద్రాబాద్‌ వాసిగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు