హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

23 Feb, 2020 10:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వీకెండ్‌ వచ్చిందంటే చాలు నగరంలో కారు బీభత్సాలు కొనసాగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలను రోడ్డుమీదకు తీసుకు వస్తుండటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిసున్నా.. తాగి వాహనాలు నడిపే వారిని జైలుకి పంపిస్తున్నా వారిలో ఇంకా మార్పు రావడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలను ప్రమాదంలో పడేయటమే కాకుండా.. అమాయకుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలను మరువక ముందే తాజాగా నగరంలో మరో రెండు చోట‍్ల కార్లు బీభత్సం సృష్టించాయి.

కర్మన్‌ఘాట్‌
కర్మన్‌ఘాట్‌ చౌరస్తాలో ఆదివారం మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. దీన్ని బట్టి అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో మల్లికార్జున్(డ్రైవింగ్), సాయిరామ్, సాయినాథ్‌లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు కళ్యాణ్ సీటు బెల్టు పెట్టుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో గాయాలపాలైన కళ్యాణ్‌ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో సాయిరామ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాగా.. కళ్యాణ్, సాయినాథ్‌లు పిలిప్స్ కంపెనీ లో మార్కెటింగ్ చేస్తున్నారు. మల్లికార్జున్‌ ఖాళీగా ఉంటున్నట్లు సమాచారం. గుర్రం గూడలో ఓ గెట్‌ టు గెదర్‌ పార్టీకి వెళ్ళి చంపాపేట్‌కి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు కళ్యాణ్ తెలిపారు. స్థానికల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.బంజారాహిల్స్‌
కాగా ఆదివారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో మరో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు రాయల్‌ టిఫిన్స్‌ హోటల్‌లోకి దూసుకెళ్లింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తర్వాత అందులో ఉన్న యువకులు కారుని అక్కడే వదిలేసి పారిపోయారు. కారు నెంబర్ ఆధారంగా యువకులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీకెండ్ కావడంతో ఫుల్లుగా తాగి రోడ్డు మీదకు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.


Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు