ట్రిపుల్‌ రైడింగ్‌.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి..!

19 Jul, 2019 08:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులపై దాడికి పాల్పడిన సంఘటన గురువారం మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. షాదుల్లానగర్‌కు చెందిన మహముదా బేగం అల్లుడు ఓల్డ్‌ సిటీకి చెందిన మహ్మద్‌ గౌస్‌ మరో ఇద్దరితో కలిసి గురువారం అత్తారింటికి ఫంక్షన్‌కు వచ్చాడు. ఇంటికి తిరిగి వెళ్తుండగా మౌలాలి కమాన్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ముజఫర్‌ వారిని ఫొటో తీశాడు. దీనిని గమనించిన సాదిక్‌ హుస్సేన్‌ అసభ్యకరంగా చేతితో సంకేతాలు చేస్తూ ముందుకు వెళ్లాడు.

కొద్ది సేపటికే వారితో పాటు అక్కడికి వచ్చిన మహముదా బేగం, ఆమె భర్త గఫార్, కుమారులు మహ్మద్‌ మాజిద్, సయ్యద్‌ సాదిక్‌ ట్రాఫిక్‌ పోలీసు ముజఫర్‌పై దాడి చేశారు. కెమెరా లాక్కున్నారు. మహముదాబేగం అతడిని చెప్పుతో కూడా కొట్టే ప్రయత్నం చేసింది. స్థానికల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.  ట్రాఫిక్‌  ఇన్‌స్పెక్టర్‌ మురళీమోహన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి జ్యూడిషియల్‌  రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. మహముదా బేగం అధికారపార్టీ నాయకురాలిగా చెలామణి అవుతున్నట్లు సమాచారం. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భార్య ప్రియునిపై పగ; తొమ్మిదిమందికి షాక్‌..!

ప్రియుడు మోసం చేశాడని..బాలిక ఆత్మహత్య

అయ్యో! రూ.2 వేల కోసం విషా(వా)దం

సెల్ఫీ వీడియో తీసి బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

క్యాషియర్‌పై దాడి చేసిన దొంగలు దొరికారు

బెట్టింగ్ చేసినందుకు ఐదుగురు అరెస్టు

డైరెక్టర్‌ రాజమౌళి.. యాక్టర్‌ లాయర్‌

మొబైల్‌ నెంబర్‌ మారుస్తున్నారా ! ఐతే జాగ్రత్త

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

నా భర్త యువతులను మోసం చేస్తున్నాడు అరెస్టు చేయండి..

32 ట్రాక్టర్లు.. 200 మంది

భర్త వ్యాధులు నయం చేస్తానని మహిళపై..

దారుణం: 24 మంది సజీవ దహనం

డ్రైవర్‌ నిద్రమత్తు.. 9 మంది దుర్మరణం..!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

మద్యం మత్తులో తాళం పగులగొట్టి ఆత్మహత్య

పని చేస్తున్న సంస్థకే కన్నం

మృత్యువులోనూ వీడని బంధం

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

పని చేస్తున్నసంస్థకే కన్నం

నీళ్లనుకుని లైజాల్‌ తాగి...

సర్వే అంటూ ఇంటి తలుపుతట్టి..

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

అల్లుడిని చంపిన మామ

వజ్రాల వాటాలో గొడవ.. అందుకే చంపేశాం

నీళ్ల కోసం ఇంత దారుణమా!

డ్రైయినేజీలో ఆలయ హుండీలు!

వైద్యం అందక చిన్నారి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ