వాషింగ్టన్‌లో కాల్పులు: ఒకరు మృతి

20 Jul, 2020 09:44 IST|Sakshi

అమెరికా: వాషింగ్టన్‌లో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. పట్టపగలే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ముగ్గురు ఆఫ్రికన్‌ అమెరికన్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన వాషింగ్టన్‌ జిల్లా వాయువ్య ప్రాంతంలోని 14 వీధి, స్పింగ్‌​ రోడ్డు వద్ద చోటు చేసుకున్నట్లు మెట్రోపాలిటన్‌ పోలీసు చీఫ్‌ పీటర్‌ న్యూషామ్‌ తెలిపారు. ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు పెద్ద గన్స్‌ను, మరో వ్యక్తి పిస్టల్‌తో జనాలపై విచక్షణరహితంగా ఆదివారం కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. (24 గంటల్లో 2.6 లక్షల మందికి)

ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా సీసీ కెమెరా ఫుటేజ్‌ సాయంతో దుండగులను పట్టుకుంటామని పేర్కొన్నారు. పట్టపగలు ఇలా దారుణంగా కాల్పులకు తెగపడటం సమాజంలో భయం కల్పించే దుర్ఘటన అన్నారు. దుండగుల కాల్పులు సంఘంలోని ప్రజలను ప్రమాదంలో పడేస్తున్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు