జాతీయ రహదారిపై ప్రమాదం 

17 May, 2020 04:16 IST|Sakshi
ధ్వంసమైన స్కార్పియో. ప్రమాదంలో మృతి చెందిన అనీశ్‌ థామస్, అతని కూతురు అనాలియా, స్టేనీ (ఫైల్‌)

ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

బిహార్‌ నుంచి కేరళ వెళుతుండగా దుర్ఘటన 

డిచ్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం నాకాతండా శివారులో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న టిప్పర్‌ను వెనక నుంచి వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేరళ రాష్ట్రం కాలికట్‌ జిల్లా కొయెన్‌చెరి గ్రామానికి చెందిన అనీశ్‌ థామస్‌ (33), తన ఇద్దరు సోదరులతో కలసి బిహార్‌లోని నెవడా జిల్లా సిర్‌దల్లాలో స్కూల్‌ నడుపుతున్నాడు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో వారి స్కూల్‌ను మూసివేశారు.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో అక్కడి అధికారుల అనుమతి తీసుకుని మూడు వాహనాల్లో ముగ్గురు సోదరులు తమ భార్యా పిల్లలతో ఈ నెల 13న బిహార్‌ నుంచి కేరళకు బయలు దేరారు. అనీశ్‌ థామస్‌తో పాటు భార్య దివ్య, కూతుళ్లు అనాలియా (14 నెలలు), అజాలియా ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం డిచ్‌పల్లి మండలం నాకాతండా వద్దకు రాగానే ఆగి ఉన్న టిప్పర్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన థామస్‌ కుటుంబాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అనీశ్‌ థామస్, కూతురు అనాలియా, డ్రైవర్‌ స్టేనీ జోస్‌ (24) మృతి చెందారు. దివ్యతో పాటు అజాలియాను మెరుౖ గెన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. డిచ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు