అతివేగమే ప్రాణాలు తీసింది..

21 Mar, 2018 12:23 IST|Sakshi
చెట్టును ఢీకొన్న డీసీఎం వాహనం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

8 మందికి తీవ్రగాయాలు

ఎమ్మిగనూరురూరల్‌/పెద్దకడుబూరు :అతివేగం నిండు ప్రాణాలను బలిగొంది. పెద్దకడుబూరు సమీపంలో మంగళవారం డీసీఎం వాహనం ఆటోను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. ఉదయం మాలపల్లి నుంచి ఎమ్మిగనూరుకు ప్రయాణికులతో ఆటో బయలుదేరింది. పెద్దకడుబూరు మం డలం నాలుగో రాయి సమీపానికి రాగానే డీసీఎం ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఆటోను ఢీకొంది. తర్వాత రోడ్డు పక్క నున్న చెట్టును ఢీకొని ఆగిపోయింది.

దీంతో ఆటోలో ఉన్న బూదురు చంద్రమ్మ(50) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. చాకలి శేకన్న(45), ఆయన భార్య చంద్రమ్మ(ఐరన్‌గళ్‌), బూదురుకు చెందిన అక్కాచెల్లెళ్లు విరుపాక్షమ్మ, యంకమ్మ, తిమోతి(మాలపల్లి), ఖలీల్‌(డోన్‌), లక్ష్మీ(చిన్నతుంబళం), వీరేష్‌(గుడేకల్‌), హతూన్‌బీ(ఎమ్మిగనూరు)కి తీవ్రగాయాలయ్యా యి. స్థానికులు వెంటనే వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించకపోవడతో చాకలి శేకన్న అక్కడే మృతి చెందాడు. బసవలదొడ్డికి చెందిన డైట్‌ విద్యార్థిని నర్మద(20)ను కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. విరుపాక్షమ్మ, యంకమ్మ, ఖలీల్‌ కర్నూలులో చికిత్స పొందుతున్నారు. శేకన్న భార్య చంద్ర మ్మకు ఎముకలు విరగడంతో ఎమ్మిగనూరులోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పెద్దకడుబూరు హెడ్‌కానిస్టేబుల్‌ మాహబూబ్‌బాషా తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు