కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి జలసమాధి

28 Feb, 2020 03:36 IST|Sakshi
ప్రాణాలతో బయటపడిన బాలుడు కార్తీక్‌, రంగయ్య, అలివేలు, కీర్తన మృతదేహాలు

మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు

బాలుడిని కాపాడిన స్థానికులు

నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాలలో ఘటన

పెద్దఅడిశర్లపల్లి: ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూ సుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ము గ్గురు జల సమాధి అయ్యారు. ఈ ఘటన గు రువారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల శివారులో గల ఏఎమ్మార్పీ లింక్‌ కెనాల్‌ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వడ్డెరిగూడేనికి చెంది న ఓర్సు రంగయ్య తన కుటుంబంతో కలసి కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని సాహెబ్‌నగర్‌లో ఉంటున్నాడు. అక్కడే జేసీబీలు నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజు ల క్రితం హైదరాబాద్‌ నుంచి వడ్డెరిగూడంలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు కుటుంబంతో కలసి కారులో వచ్చాడు. గురువారం ఉదయం తిరుగు ప్రయాణంలో ఏఎమ్మార్పీ లింక్‌ కెనాల్‌ వెంట ఉన్న రోడ్డుపై ప్రయాణిస్తుండగా 5.8 కిలోమీటరు వద్దకు రాగానే కా రు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది.

నీట మునిగిన కారు ​​​​
కారు కొట్టుకొని పోతుండటం చూసిన స్థానికులు రాంబాబు, విజయ్‌లు వారిని రక్షించేందుకు కాలువలోకి దూకారు. కారు వెనుక డిక్కీ డోరు తీసి రంగయ్య కుమారుడు కార్తీక్‌ను కా పాడి ఒడ్డుకు చేర్చారు. మిగతా వారిని రక్షించేందుకు ప్రయత్నించగా.. అప్పటికే కారు మొత్తం కాలువలో మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న రంగయ్య (40), భార్య అలి వేలు (38), కుమార్తె కీర్తన (19) మృతి చెం దారు. గుడిపల్లి ఎస్‌ఐ గోపాల్‌రావు స్థానికుల సహాయంతో మృతదేహాలను, కారును వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాల ను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో వడ్డెరిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన కళ్లెదుటే తల్లిదండ్రులు మృతి చెందడంతో కార్తీక్‌ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

మరిన్ని వార్తలు