ఈతకెళ్లి ముగ్గురు యువకుల మృతి

21 Feb, 2018 21:54 IST|Sakshi
మృతదేహాల వద్ద బంధువుల ఆర్త నాదాలు

వరంగల్‌ రూరల్‌ జిల్లా : శాయంపేట మండలం మందారిపేటలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. వివరాలు.. మందారిపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నిమ్మల రమేష్‌ కూతురి వివాహానికి హాజరయ్యేందుకు వరంగల్‌ నగరం నుంచి కొంత మంది బంధువులు వచ్చారు. భోజనాలు అయ్యాక ఊరి చివరన ఉన్న గోగుకుంట చెరువు వద్దకు వెళ్లారు. సరదాగా ఈతకొట్టేందుకు ఓ యువకుడు చెరువులోకి దిగగా..లోతు అంచనా వేయడంతో తప్పు జరగడంతో మునిగిపోయాడు.

స్నేహితుడిని కాపాడబోయి మరో ఇద్దరు యువకులు కూడా మునిగి చనిపోయారు. విషయం తెలిసి గ్రామస్తులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతులు వరంగల్‌ నగరం కొత్తవాడకు చెందిన దేవులపల్లి వంశీకృష్ణ(20), రంగు సాయికృష్ణ(20), ఆలేటి సునీల్‌(20)గా గుర్తించారు. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు