ముగ్గురు మహిళల ఆత్మహత్య

7 Jul, 2019 10:35 IST|Sakshi
మృతులు గీత, శారద

వేర్వేరు ప్రాంతాల్లో ఘటన

సాక్షి,  మేడిపెల్లి(కరీంనగర్‌) : మేడిపెల్లి మండలం లింగంపేటకు చెందిన పల్లికొండ గీత ఊరాఫ్‌ తోపారపు గీత(32) యాసిడ్‌తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. లింగంపేటకు చెందిన తోపారపు లక్ష్మయ్య–గంగరాజుల కూతురు గీతను 13ఏళ్లక్రితం వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన పల్లికొం డ గంగాధర్‌కిచ్చి వివాహం చేశారు. వీరికి ప్రణీత్, పల్లవి అనే ఇద్దరు పిల్లలున్నారు.గంగాధర్‌ ఉపాధి నిమిత్తం గల్ఫ్‌వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన పల్లికొండ నర్సయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. నెలరోజుల క్రితం గల్ఫ్‌నుంచి ఇంటికొచ్చిన గీత భర్త గంగాధర్‌కు విషయం తెలిసింది.

దీంతో గీతను పుట్టినిల్లయిన లింగంపేటలో రెండ్రోజుల క్రితం వదిలిపెట్టి వెళ్లాడు. తండ్రి లక్ష్మయ్య కూతురును నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. విషయం అందరికి తెలిసిందని, నర్సయ్య వద్దకు వెళ్తే.. దురుసుగా ప్రవర్తించాడని చెప్పింది. శుక్రవారం ఉదయం బాత్రూంలోకి వెళ్లి యాసిడ్‌తాగింది. సిరిసిల్ల ఆస్పత్రికి తరలించి... అక్కడినుంచి కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందు తూ శనివారం చనిపోయింది. హెడ్‌ కానిస్టేబుల్‌ రవి గీత తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు పల్లికొండ నర్సయ్యపై కేసు నమోదు చేశారు. గీతకు స్వగ్రామం హన్మాజీపేటలో అంత్యక్రియలు నిర్వహించారు. 

ఉరివేసుకొని వివాహిత..
మెట్‌పల్లి : పట్టణంలోని మఠంవాడకు చెందిన మౌనిక(23) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు. మౌనికకు ఎనిమిది సంవత్సరాల క్రితం మధుకర్‌తో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నారు. గత కొంతకాలంగా అనార్యోగంతో బాధపడుతున్న మౌనికకు పలు ఆసుపత్రిలో చికిత్స చేయించిన అది తగ్గలేదు.మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. 

చెరువులో దూకి వృద్ధురాలు.. 
కోరుట్ల : కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బకు చెందిన శారద(70) జీవితంపై విరక్తితో శనివారం ఉదయం స్థానిక మద్దుల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం సమయంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మహిళ ఆత్మహత్యాయత్నం
ధర్మపురి : ధర్మపురి మండలంరాయపట్నం గ్రామానికి చెందిన గటికె బుచ్చక్క(55) శనివారం సాయంత్రం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. బుచ్చక్కకు పుట్టుకతోనే మాటలు రావు. వివాహకం కాలేదు. ఇంటివద్దే ఉంటోంది. వయసు పైబడిన కొద్ది జీవితంపై విరక్తి చెందింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని, నిప్పటించుకుంది. మంటలకు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి మంటలార్పారు. 50శాతం గాయాలపైన బుచ్చక్కను కుటుంబసభ్యులు జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

అందుకే చచ్చిపోవాలనిపించింది

ప్రాణాలు తీసిన స్టాపర్‌

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

ప్రాణం తీసిన బిందె

మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

స్కెచ్చేశాడు.. చంపించాడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్‌

కాగ్నిజెంట్‌ ఉద్యోగి ఆత్మహత్య

బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

రూ. 3.3 కోట్లు దోచేసి.. దర్జాగా..

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

తల ఛిద్రం; మోడల్‌ దారుణ హత్య

బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

గిద్దలూరు వాసి చిత్తూరులో ఆత్మహత్య

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన యువతి..

అంత్యక్రియల అనంతరం నిలదీస్తే.. ఒప్పుకొన్న భర్త

తల్లి జబ్బుపడిందని.. కుమార్తె ఆత్మహత్య

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

తమ్ముడిపై కొడవలితో దాడి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం