మూడేళ్ల చిన్నారిపై పొరుగింటి వ్యక్తి..

12 Feb, 2020 09:47 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం దారుణంగా హత్య చేశాడో పొరుగింటి కామాంధుడు. ఈ దారుణ ఘటన సీతాపూర్‌లోని మహోలీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహోలీ ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుంది. చిన్నారి తల్లిదండ్రులు పనిపై సితాపూర్‌కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన పొరుగింటి వ్యక్తి రాజు చిన్నారికి బిస్కెట్ల ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి గొంతునులిమి చంపేశాడు. మృతదేహాన్ని ఓ సంచిలో మూటకట్టి బకెట్‌ కింద దాచాడు.

సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా ఎవరూ తమకు కనబడలేదని చెప్పారు. దీంతో చిన్నారి కోసం ఊరంతా వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో రాజు ఇంటివెనక ఉన్న పెరట్లో చిన్నారి చెప్పులు కనిపించాయి. రాజుని నిలదీయగా.. దాటవేసే ప్రయత్నం చేశాడు. రాజు ప్రవర్తన పట్ల అనుమానం వచ్చి.. ఇంట్లోకి వెళ్లి వెతుకగా.. బకెట్‌ కింద సంచిలో చిన్నారి మృతదేహం లభించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాజును అదుపులోకి తీసుకున్నారు.  చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడికి తక్షణమె కఠిన శిక్ష విధించాలంటూ ధర్నాకు దిగారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కేసుపై సంబంధించి విచారణ చర్యలు చేపడుతున్నామని పోలీసు ఉన్నతాధికారి ఎంపీ సింగ్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా