మృత్యువులోనూ వీడని బంధం

3 Jun, 2018 11:22 IST|Sakshi
పిడుగుపాటుతో మృతి చెందిన భార్యాభర్తలు, సంఘటనా స్థలం వద్ద వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు  

ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. చిరుజల్లులు మొదలయ్యాయి. ఇంతలో ఉరుములు, మె రుపులు మొదలయ్యాయి. ఒక్కసారిగా ఆకాశం విడిగిపడిందా అన్న ఆలోచనలో ఉండగానే జరగరాని ఘోరం జరిగిపోయింది. పొలం గట్టున కూర్చుని గొర్రెలను మేపుతున్న భార్యాభర్తలపై పిడుగుపడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన శనివారం మిర్యాలగూడ మండలంలోని అవంతీపురం గ్రామ శివారులో జరిగింది. స్థానికులు, రూరల్‌ ఎస్‌ఐ సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం..

మిర్యాలగూడరూరల్‌ : ఆలగడప గ్రామానికి చెందిన ఎల్లావుల వెంకయ్య (60), నారమ్మ (55)భార్యాభర్తలు. వెంకయ్య అవంతీపురం గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే రైతు వద్ద గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే ఆలగడప గ్రామం నుంచి పక్కనే ఉన్న అవంతీ పురం వచ్చి యజమాని గొర్రెలను మేపేందుకు గ్రామ శివారులోని జమాయిల్‌ తోట వద్దకు తోలు కెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత నారమ్మ ఇంట్లో ఒం టరిగా ఉండడంతో పాలుపోతలేదని భర్త గొర్రెలు మేపే ప్రదేశానికి వచ్చింది.

భార్యాభర్తలిద్దరూ గొర్రెలను కనిపెడుతూ పొలం గట్టుపై కూర్చున్నా రు. ఇంతలో పిడుగుపడడంతో దంపతులిద్దరూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న రూరల్‌ సీఐ రమేశ్‌బాబు, ఎస్‌ఐ డి.సైదాబాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరి శీలించి పిడుగుపాటుకే మృతిచెందినట్టు నిర్ధారించారు. దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరికి వివాహాలు అయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. 

ఎమ్మెల్యే నివాళి
పిడుగుపాటుతో భార్యాభర్తలిద్దరూ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మిర్యాలగూడ ఎ మ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాడు. వివరాలు తెలుసుకున్నాడు. మృతుల ఆత్మకు శాంతికలగాలని నివాళులర్పించారు. దంపతుల కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చాడు. నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, జెడ్పీటీసీ మట్టపల్లి నాగలక్ష్మిసైదులుయాదవ్, ఎంపీటీసీ నల్లగొండ భవాని, సర్పంచ్‌ వీరమ్మ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు