టిక్‌టాక్‌​ జానీ దాదా కథ అలా ముగిసింది

7 Oct, 2019 09:03 IST|Sakshi
టిక్ టాక్ అశ్విని కుమార్ (ఫైల్‌ ఫోటో), మృతదేహం

సర్వం నాశనం  చేస్తానంటూ సోషల్ మీడియాలో  హల్‌చల్‌

మూడు హత్య కేసుల్లో నిందితుడు, టిక్‌టాక్‌ విలన్‌ జానీ దాదా ఆత్మహత్య

పోలీసులను  చూసి భయంతో  తుపాకీతో కాల్చుకున్న అశ్వినీ కుమార్‌  

‘‘ప్రతిదీ నాశనం చేస్తా..చూస్తూ వుండండి" అంటూ సంచలన రేపిన వివాదాస్పద టిక్‌టాక్‌ విలన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అశ్వినీకుమార్ (30), అలియాస్ జానీ దాదా కథ విషాదాంతమైంది. మూడు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడైన అశ్వినీ కుమార్‌ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘అన్నింటినీ నాశనం చేస్తా’, ‘దెయ్యం రెడీగా ఉంది’, ‘నేను సృష్టించే విలయం చూడండి’ అంటూ పోస్టింగులు పెట్టే జానీ దాదా చివరికి బర్హాపూర్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున తనను తాను కాల్చుకుని చనిపోయాడు.

అశ్వినీ కుమార్ మాదక ద్రవ్యాలకు బానిసగా మారినట్టుగా అనుమానిస్తున్న అశ్వినీ మూడు హత్యకేసులో నిందితుడుగా ఉన్నాడు. ముఖ్యంగా సెప్టెంబరు 30 న, దుబాయ్‌లోని ఒక హోటల్‌లో పనిచేస్తూ, పెళ్లి కోసం సొంత వూరు బిజ్నూర్‌ వచ్చిన నితికా శర్మ (27)ను దారుణంగా  కాల్చి చంపడం కలకలం రేపింది. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన కారణంతో నికితాపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. అలాగే వెస్ట్ యుపిలో బీజేపీ నేత కుమారుడు (26), అతని మేనల్లుడిని (25) హత్య చేసి  తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడి ఆచూకీ కోసం లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు పోలీసులు. భయంకరమైన హత‍్యల​ నిందితుడు అశ్వినీ కుమార్‌ కోసం పోలీసులు ఇటీవల గాలింపును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అతగాడు ఢిల్లీ పారిపోయేందుకు బస్సెక్కాడు. ఈ విషయాన్నిగమనించిన పోలీసులు తనిఖీ చేయటానికి బస్సును ఆపడంతో భయపడి తుపాకితో కాల్చుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు.

తెల్లటి రుమాలుతో ముఖం కప్పుకుని ప్రయాణిస్తున్నఅతగాడిపై స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అశ్వినీ కుమార్‌ పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బస్సును ఆపగా, కాల్చకుని చనిపోయాడని బిజ్నోర్ పోలీసు సూపరింటెండెంట్ (గ్రామీణ) విశ్వజీత్ శ్రీవాస్తవ తెలిపారు.అంతేకాదు అతను ఎపుడూ ఒక పిస్తోల్‌ను, రెండు మ్యాగజైన్స్ (బుల్లెట్ల)  14 పేజీల నోటును వెంట తీసుకెళ్తాడట. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అశ్విని కుటుంబం అందించిన సమాచారం ప్రకారం గ్రాడ్యుయేట్‌ అయిన అశ్విన్‌ ప్రైవేట్ సంస్థ లో పనిచేశాడు.  అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదు. మత్తు మందులకు అలవాడు పడ్డాడు. అశ్వినీ తండ్రి ధంపూర్ తహసీల్ లోని చెరకు సహకార సంఘంలో గుమస్తాగా ఉండగా, అతని అన్నయ్య డెహ్రాడూన్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

మరిన్ని వార్తలు