కుప్పకూలిన భారీ షెడ్డు.. తొక్కిసలాట

30 Jul, 2018 13:46 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ గంగానగర్‌ జిల్లా పదంపూర్‌ పట్టణం అజాజ్‌ మండిలో ట్రాక్టర్ల రేసు నిర్వహించారు. ప్రతీ ఏటా నిర్వహించే రేసును తిలకించేందుకు ఈసారి భారీ సంఖ్యలో(సుమారు 5 వేల మంది అని అంచనా) జనం హాజరయ్యారు. అత్యుత్సాహంతో వందల మంది అక్కడే ఉన్న ఓ షెడ్డూపై ఎక్కి వీక్షిస్తున్నారు. అదే సమయంలో బరువుకు తాళలేక ఆ షెడ్డూ కుప్పకూలిపోయింది. ఆ వెంటనే తొక్కిసలాట చోటు చేసుకోగా.. పరిస్థితి అదుపులోకి రావటానికి రెండు గంటలకు పైగానే పట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు